కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో టి.ఎస్.ఎస్.పి కి చెందిన పోలీసులు వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నారని ఒక యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారమైన తప్పుడు కదనాన్ని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగం తీవ్రంగా ఖండించింది డిచ్ పల్లి 7 వ పోలీస్ బెటాలియన్ కు చెందిన పోలీసులు, తమ బెటాలియన్ లో వెర్మీ కంపోస్టు తయారీకి వ్యవసాయ భూముల్లో వరి కోతలు ముగిసిన అనంతరం మిగిలిన గడ్డిని తీసుకెళ్తున్న సందర్బంగా వీడియోను తీసి ఫార్మ్ హౌస్ లో పనులు చేస్తున్నట్టు తప్పుడుగా చూపారని TSSP అడిషనల్ డిజి అభిలాష బిస్ట్ తెలిపారు.
ఇప్పటికే బెటాలియన్ ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 4.2 లక్షలకు పైగా మొక్కలు నాటడం జరిగిందని తెలిపారు. ఆ మోక్కల మనుగడకై పెద్ద ఎత్తున వెర్మీ కాంపోస్టు తయారీ ని చేపట్టామని అన్నారు. వెర్మీ కంపోస్టు తయారీకై వృధాగా ఉండే గడ్డిని సేకరిస్తామని, అదేవిధంగా మొక్కల ఎదుగుదలకు వీలుగా మల్చింగ్ కై కూడా గడ్డిని ఉపయోగిస్తామని వివరించారు. 7 వ బెటాలియన్ ద్వారా చెపట్టిన వెర్మీ కంపోస్టు తయారీకి స్థానిక ప్రజలు కూడా తమ తోడ్పాటునందిస్తున్నారని తెలిపారు.
ఈ తయారైన వెర్మీ కంపోస్టు ను హరితహారంలో నాటిన మొక్కల ఎదుగుదలకు ఉపయోగిస్తూ, ఉచితంగా కూడ పంపిణీ చేస్తున్నామని TSSP ADG స్పష్టం చేశారు. TSSP చేస్తున్న ఈ కృషిని తప్పుదారి పట్టించే విధంగా, తప్పుడు వార్తలను, కట్టుకదలను ఒక యు ట్యూబ్ ఛానెల్ లో ప్రసారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు అడిషనల్ డీజీ అభిలాష బిస్ట్ తెలియ చేశారు. ఈ విధమైన తప్పుడు వార్తలు పోలీసుల మనో ధైర్యాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయని, ఇది సమాజానికి మంచిది కాదని ఏ.డి.జీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ వీడియోలో పేర్కొన్నవి అవాస్తవాలు – TSSP ADG
హైదరాబాద్, అక్టోబర్25: సీఎం శ్రీ కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో టి.ఎస్.ఎస్.పికి చెందిన పోలీసులు వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నారని ఒక యూట్యూబ్ ఛానెల్ లో ప్రసారమైన తప్పుడు కథనాన్ని తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ విభాగం తీవ్రంగా ఖండించింది. 1/n pic.twitter.com/AUfJTDrsKF
— FactCheck_Telangana (@FactCheck_TS) October 25, 2022