సంక్రాతి స్పెషల్: సంక్రాంతి పండుగ విశిష్టత, ప్రత్యేకత చూడాల్సిందే..!

-

సంక్రాతి అంటే పెద్ద పండుగ. వరుసగా నాలుగు రోజుల పాటు ఈ పండుగని జరుపుతారు. ఈ పండుగ విశిష్టత, ప్రత్యేకత ప్రతీ ఒక్కరు తప్పక తెలుసుకోవాలి. సంక్రాంతి గురించి ఎన్నో విషయాలు మీకోసం మరి చూసేయండి. సంక్రాంతి రోజులలో పిండివంటలని తయారు చేయడం ఆనవాయితీ. సంక్రాంతి రాక ముందే అనేక రకాల పిండి వంటలని తయారు చేస్తారు. ముఖ్యంగా అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, చక్కినాలు, పాలతాలుకలు వంటివి చేస్తారు. అలానే కొత్త బట్టలు ధరించి ఈ పండుగను ఘనంగా చేస్తారు.

అలానే చాలా మంది పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఇది తప్పక చేస్తారు. అలానే సంక్రాంతి అంటే గంగిరెద్దులను పక్క. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు ఆ ఎద్దులు నాట్యం చేస్తాయి. ఇది కూడా కేవలం సంక్రాంతి నాడే చూడగలిగే దృశ్యం. ఇక మరో ప్రత్యేకం ఏమిటంటే హరిదాసులు.

గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ కృష్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. ఆధ్యాత్మిక గీతాలని పాడుతూ గజ్జెలతో నాట్యం చేస్తున్నప్పుడు చూస్తే ఎంతో రమణీయంగా ఉంటుంది కదూ..! అలానే సంక్రంతి పండుగ కి పెద్దలు కూడా పిల్లల తో కలిసి గాలిపటాలని ఎగురవేస్తారు. చూడ ముచ్చటగా ఉంటుంది ఇవన్నీ చూస్తే.

Read more RELATED
Recommended to you

Latest news