అర్ధరాత్రి నడిరోడ్డుపైకి గెంటేసాడంటూ స్టార్ హీరో భార్య ఆవేదన..

-

బాలీవుడ్ లో హీరోగా నవాజుద్దీన్ సిద్ధికి ఎంత పేరు సంపాదించుకున్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకొని సక్సెస్ఫుల్గా సినీ కెరీర్ను నడిపిస్తున్నారు. అయితే అతని వ్యక్తిగత జీవితం మాత్రం ఎప్పుడూ విభేదాలతోనే నడుస్తోంది. ముఖ్యంగా తనని ఎంతగానో వేధిస్తున్నాడు అంటూ అతని భార్య పలుమార్లు చెప్పకు వచ్చింది. తాజాగా మరొకసారి తనకు అన్యాయం జరిగిందంటూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను పంచుకుంది.

అర్ధరాత్రి సమయంలో తనను తన పిల్లలను ఇంటి నుంచి బయటకు గెంటేసాడు అంటూ నవాజుద్దీన్ సిద్ధికి భార్య ఆలియా ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఎన్నోసార్లు తనను వేధిస్తున్నాడంటూ ఆలియా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ గొడవలు కాస్త ఇప్పుడు పెద్దవిగా మారి తనను ఇంట్లోంచి బయటకు గెంటేసాడు అంటూ చెప్పకు వచ్చింది.

ముంబైలో ఒక అపార్ట్మెంట్లో ఉంటున్న నవాజుద్దీన్ సిటీకి సిద్ధికి అర్ధరాత్రి తన భార్య ఆలియా పిల్లలను బయటకు గెంటేసారు అంటూ ఆరోపించింది. అతని భార్య నడిరోడ్డుపై నిలబడి ఒక వీడియోను షేర్ చేసుకుంది. ఈ అర్ధరాత్రి మమ్మల్ని ఇంట్లోంచి బయటకు గెంటేసాడు నా ఇద్దరు పిల్లల్ని కూడా బయటకు పంపేశాడు నా కుమార్తె ఏం చేయాలో తోచక వాళ్ళ నాన్న ఇంటి వైపు చూస్తూ ఏడుస్తోంది. ప్రస్తుతం నా దగ్గర 81 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ సమయంలో ఇద్దరు పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో అర్థం కావడం లేదు. నవాజుద్దీన్ నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నిన్ను వదలను. నన్ను నా పిల్లల్ని రోడ్డు మీద నిలబెట్టిన నిన్ను ఎప్పటికీ వదలను అంటూ చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

గతంలో కూడా ఆలియా తన నుండి తన పిల్లలను వేరు చేయటానికి నవాజుద్దిన్ ప్రయత్నిస్తున్నాడని తన పిల్లలు అక్రమ సంతానమని అతని తల్లి ఆరోపించినప్పుడు ఏమి మాట్లాడలేదని చెప్పుకొచ్చింది. తన పిల్లల్ని తన నుంచి లాక్కోవడానికి ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోనని తెలిపింది. ఏ రోజు ప్రేమగా చూడని నువ్వు ఒక భర్తవి తండ్రివి ఎలా అవుతావు అంటూ ప్రశ్నించింది. ఇప్పటికే ఈ వీడియోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూ ఉండగా తాజాగా మరొకసారి ఇంటి నుంచి గెంటేసాడు అంటూ ఆరోపించి చర్చకు దారి తీసింది.

Read more RELATED
Recommended to you

Latest news