తెలంగాణాలో ఆ ఒక్క చోటే 2 వేల మంది సూపర్ స్పైడర్ లు…!

కరోనా వాక్సిన్ విషయంలో తెలంగాణా ప్రభుత్వం ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఈ నేపధ్యంలోనే సూపర్ స్పైడర్ లకు కరోనా వాక్సిన్ అందిస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రం లో రెండు వేల మంది సూపర్ స్పైడర్లకు టీకాల పంపిణీని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. కరోన ప్రబలకుండా టీకాలు అందిస్తున్నామని అన్నారు.

వనపర్తిలో 2000 మంది సూపర్ స్పైడర్ లను గుర్తించడం జరిగింది అన్నారు. వీరు నిత్యం ఎక్కువమందిని కలుస్తుంటారు కాబట్టి వారికి మొదట టీకాలు వేయడం జరుగుతుంది అని తెలిపారు. కరోనా నియంత్రణలో అందరూ సహకరించాలి అని కోరారు. లాక్ డౌన్ నిబంధనలు అందరూ పాటించాలి అని మంత్రి విజ్ఞప్తి చేసారు.