ఆచార్య సినిమా నుంచి తప్పించిన సెలబ్రిటీలు వీళ్ళే..!!

-

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఆచార్య. ఇక ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. అయితే మొదటి షో కే ఈ సినిమా నెగిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ప్రతి ఒక్కరు దర్శకుడు కొరటాల శివ పై ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడీగా పూజాహెగ్డే నటించగా.. ఇక మెగాస్టార్ కు జోడిగా త్రిషను అనుకున్నారు. కానీ ఆమె ఈ సినిమా నుంచి తప్పుకొంది. ఆ తర్వాత కాజల్ ని కూడా అనుకున్నారు. తగ్గట్టుగానే లాహే లాహే పాటను కూడా చిత్రీకరించడం జరిగింది. ట్రైలర్ విడుదల అయ్యే వరకు కూడా కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో ఉందని అందరూ అనుకున్నారు. కానీ ఉన్నట్టుండి దర్శకుడు కథ మార్చడంతో ఆమెను కూడా ఈ సినిమా నుంచి తీసివేయడం జరిగింది.Acharya Movie Review - Movie Reviews

దర్శకుడు ఆమెను ఒప్పించి మరీ సినిమా నుంచి తప్పించారు అనే వార్తలు కూడా వినిపించాయి. గల కారణం ఏమిటంటే నక్సలైటు పాత్ర కు లవ్ స్టోరీ సెట్ అవ్వకపోతే అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక అలా కేవలం కాజల్ అగర్వాల్ ను మాత్రమే కాదు మరికొంతమంది స్టార్స్ ని కూడా తప్పించారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఎవరెవరు అంటే కాజల్ అగర్వాల్ తో పాటు గెటప్ శ్రీను, జబర్దస్త్ సత్య, చమ్మక్ చంద్ర వంటి వారు కూడా ఈ పాటలో కనిపించిన విషయం మనకు తెలిసిందే.. వీరిని కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించారు.

ఈ సినిమాలో కాజల్ తో చేసిన కాంబినేషన్ సీన్లు కూడా కొరటాల శివ ఎడిటింగ్లో తీసేసారట. కనీసం ఈమెను పెట్టి ఉన్నట్లైతే ఖచ్చితంగా సినిమా విజయం సాధించి ఉండేదని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉండగా ఎట్టకేలకు సినిమా కథ బాగా లేదు కాబట్టే సినిమా డిజాస్టర్ గా మిగిలింది అని మరి కొంతమంది చెబుతున్నారు. ఇక అలా మొదట్లో కొంతమంది ని పెట్టి ఆ తర్వాత సినిమా నుంచి తప్పించడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news