విశాఖలో రుషికొండ విద్వాంకానికి నిరసనగా టిడిపి శుక్రవారం తలపెట్టిన ఆందోళనలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆ పార్టీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న పోలీసులు విజయవాడలో అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసుల వైఖరికి నిరసనగా వన్ టౌన్ లోని తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై ట్విట్టర్ వేదికగా స్పందించారు టిడిపి అధినేత నారా చంద్రబాబుు నాయుడు. “ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడీపై టీడీపీ పోరుబాటను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే మా నేతల పోరుబాట. మహిళా నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనం. ఉత్తరాంధ్రలో ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులను దోచుకున్నందునే టీడీపీ పోరుబాట పై ప్రభుత్వం భయపడుతుంది. ఎవరు ఎంతగా అడ్డుకున్నా ‘సేవ్ ఉత్తరాంధ్ర’ నినాదం ఆగదు. రుషికొండ విధ్వంసం, దసపల్లా భూముల దోపిడీలు, ఆస్తుల ఆక్రమణలు, గంజాయి సాగు-అమ్మకాలు, అక్రమ మైనింగ్ పై వైసీపీ దారుణాలను ప్రజల ముందు ఉంచి తీరుతాం. ఉత్తరాంధ్రకు అండగా నిలుస్తాం. “. అని ట్విట్ చేశారు.
ఉత్తరాంధ్రలో వైసీపీ దోపిడీపై టీడీపీ పోరుబాటను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. కొండలను సైతం మింగుతున్న వైసీపీ అనకొండల బండారం బయట పెట్టేందుకే మా నేతల పోరుబాట. మహిళా నేతలను సైతం నిర్బంధించడం పాలకుల అరాచకత్వానికి నిదర్శనం.(1/3) pic.twitter.com/ReCJTQGGMe
— N Chandrababu Naidu (@ncbn) October 28, 2022