తెలంగాణ యాదవులకు గుడ్ న్యూస్. తెలంగాణలో రెండో విడత గొర్రెల పంపిణీని అంబేద్కర్ జయంతి రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతలో 3.93 లక్షల మందికి 82.64 లక్షల గొర్రెలను పంపిణీ చేశారు.
రెండో విడతలో 3.38 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించగా, ఈ గొర్రెలను ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా నుంచి కొనుగోలు చేయనుంది. ఒక యూనిట్ కింద లబ్ధిదారులకు 20 అడ, 1 మగ గొర్రెను ప్రభుత్వం ఇస్తోంది.