చైనాను తిట్టిన వ్యాపారులే మళ్ళీ చైనా వస్తువులు అమ్మడం మొదలుపెట్టారుగా…!

-

దేశ వ్యాప్తంగా ఇప్పుడు చాలా వరకు చైనా మీద వ్యతిరేకత అనేది ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైనా పేరు వింటే చాలు దేశ భక్తులు చాలా మంది ఆగ్రహంగా ఉన్నారు. చైనా నుంచి వస్తున్న వస్తువులను కూడా దిగుమతి చేసుకునే ఆలోచన చేయడం లేదు. వ్యాపారాలు భారీగా చైనా వస్తువులతో చేసే వారు కూడా ఇప్పుడు హైదరాబాద్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో అసలు చైనా వస్తువులే వద్దు అంటున్నారు.

అయితే అది అంత సాధ్యం కాదని తాజాగా ప్రూవ్ అయింది. చైనా వస్తువులను వాడేది లేదు అమ్మేది లేదు అని చెప్పిన చాలా మంది హైదరాబాద్ వ్యాపారులు వాటిని మళ్ళీ దిగుమతి చేసుకుంటున్నారు. భారత్ లో తయారయ్యే చాలా వస్తువులు మధ్యతరగతి ప్రజలు కొనే పరిస్థితి ఉండదు. మన్నిక నాణ్యత ఉన్నా సరే ధర ఎక్కువ. అందుకే చాలా మంది చైనా ఇప్పుడు మళ్ళీ చైనా వస్తువుల అమ్మకం మొదలుపెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news