పాము పేరు వింటేనే వణుకు పుడుతుంది మనకు. అలాంటిది ఇక పామును డైరెక్టుగా చూస్తే ఇంకేమైనా ఉందా ఆమడ దూరం పరుగు పెట్టాల్సిందే. అలాంటి పామును ఇక పట్టుకోవడమంటే ఎంతో సాహసమనే చెప్పాలి. పెద్ద వయస్సు వారే పామును చూసి జడుసుకుంటారు. అలాంటిది ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా పామును పట్టుకుని దాన్ని హాస్పిటల్ కు కూడా తీసుకెళ్లాడు. ఇక దీన్ని చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
విషయం ఏంటంటే తమిళనాడులోని కాంచీపురానికి చెందిన రాము కొడుకు దర్షిత్ అక్కడే ఏడో తరగతి చదువుకుంటున్నాడని తెలుస్తోంది. కాగా ఆ బుడ్డోడు తన అమ్మమ్మ గారి పొలంలో ఆడుకుంటుండగా నల్లగా ఉన్న పెంజర పాము కాటేసింది. అయితే బుడ్డోడు మాత్రం భయపడకుండా ఆ పామును వెతికి మరీ చంపేశాడు.
ఆ తర్వాత ఆ పామును తీసుకుని ఇంటికి వెళ్లాడు. ఇక తల్లిదండ్రులు కూడా చిన్నారిని, పామును తీసుకుని కాంచీపురం హాప్పిటల్‌కు వెళ్లి చికిత్స అందించారు. కానీ చిన్నారిలో పెద్దగా మార్పు లేకపోవడంతో డాక్టర్లు డిశ్చార్జిచేసి ఇంటికి పంపించారు. అయితే ఇంటికి పోయినాక చిన్నారి ఆరోగ్యం క్షీనించడంతో చెన్నైలో ఉన్న పిల్లల హాస్పిటల్‌లో చికిత్స చేయించారు. అయితే పామును ఎందుకు తీసుకొచ్చావంటే పాము ఏదో తెలిస్తేనే కదా ట్రీట్ మెంట్ ఇచ్చేది అని ఆ చిన్నారి సమాధానం చెప్పాడు.