వాస్తు: కలలో బంగారం, వెండి కనపడితే ఏం జరుగుతుంది..?

-

చాలా మంది వాస్తుకి అనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. నిజానికి వాస్తు ప్రకారం అనుసరించడం వలన ఎలాంటి బాధలు అయినా సరే తొలగిపోతాయి. అందుకనే ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో వాస్తు ప్రకారం ఫాలో అవుతూ ఉంటారు. అలానే మన జీవితం లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒక్కొక్కసారి సమస్యలు ఉంటే ఒక్కొక్కసారి ఆనందాలు ఉంటాయి.

ఏది ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు ఊహించలేము. అలానే మనకి కలలు కూడా వస్తూ ఉంటాయి కలలో జరిగేవి మన జీవితంపై కూడా ప్రభావం చూపిస్తాయి. కొన్నిసార్లు పీడకలలు వస్తూ ఉంటాయి అటువంటప్పుడు ఏదో చెడు జరుగుతుందని తెలుసుకుంటూ ఉంటాము. అయితే కలలో బంగారం కానీ వెండి కానీ కనబడితే ఏమవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.

కల లో కనుక బంగారు ఆభరణాలు లేదంటే వెండి ఆభరణాలు వంటివి కనబడితే మీ జీవితంలో ఏదో పెద్ద మార్పు జరగబోతుందని ఎదుగుదల ఉంటుందని దానికి సంకేతం ఒకవేళ కనుక బాగా ఎక్కువ బంగారం బాగా ఎక్కువ వెండి మీ కల లో కనపడితే మీ వ్యాపారంలో నష్టం రాబోతుందని దానికి సంకేతం.

ఎవరికైనా బంగారం లేదా వెండిని బహుమతిగా ఇస్తున్నట్లు మీకు కల వచ్చిందంటే అది మళ్లీ మీ మంచికే. ఒకవేళ అందంగా ఆభరణాలతో మిమ్మల్ని మీరు అలంకరించుకుంటే మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉన్నట్టు. మీరు మీకు స్వయంగా బంగారం కొనుక్కున్నట్టు కల వస్తే త్వరలోనే మీకు మంచి జరుగుతోందని దానికి అర్థం.

Read more RELATED
Recommended to you

Latest news