భర్త కొట్టడం లేదని విడాకులు కోరిన భార్య..!

-

సాధారణంగా  పెళ్లి అనేది నూరేండ్ల పంట అంటుంటారు పెద్దలు. అయితే ఇది తమకు నచ్చినప్పుడు మాత్రమే అంటోంది ఈ జనరేషన్. నచ్చకపోతే నూరేండ్లు కాదు కదా.. మూడు రోజులకైనా విడిపోవడానికి రెడీగా ఉంటున్నారు కొందరు. విచిత్రం ఏంటంటే పలువురు చిన్న చిన్న కారణాలకే డివోర్స్ కోరుతుంటారు. మరికొందరు విడాకులు చెప్పే రీజన్స్ అయితే విన్నవారికి నవ్వు తెప్పించేలా, ఆశ్చర్యం కలిగించేలా ఉంటాయి. అలాంటి ఓ సంఘటనే ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఓ భార్య తన భర్తతో విడిపోవడానికి గల చెప్పిన కారణాలు విన్న ప్రజలే కాదు, చివరికి కోర్టులో జడ్జి కూడా నవ్వుకున్నారట.

యూపీకి చెందిన ఓ మహిళ పెళ్లైన 18 నెలలకే విడాకులకోసం కోర్టుకెక్కింది. అయితే కేసు వాదనల సందర్భంగా విడిపోవడానికి ఆమె చెప్పిన కారణాలను విన్న న్యాయమూర్తితోపాటు అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతకీ సదరు మహిళ ఏం చెప్పిందంటే.. తన భర్త తనను మరీ ఎక్కువగా ప్రేమిస్తున్నాడట. తనతో గొడవ పడటం లేదట. దీనివల్ల బోర్ ఫీల్ అవుతున్నానని, జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయిందని తెలిపింది. అంతేకాదు..  ‘నా భర్త మంచోడు. రోజూ వంట కూడా తనే చేస్తాడు. కోరింది ఇప్పిస్తాడు. ఏం చెప్పినా కాదనడు. అన్ని విషయాల్లో హెల్ప్ చేస్తాడు. ప్రేమలో ముంచేస్తాడు. ఒక్కసారి కూడా నన్ను తిట్టడు, ఏ విషయంలోనూ విమర్శించడు. ఇదే నాకు సమస్యగా ఉంది. ఇంత మంచివాడితో కాపురం చేయడం ఇబ్బందిగా ఉంది” అని చెప్పుకొచ్చిందట. అయితే ఇది విన్న జడ్జి మాత్రం ఇలాంటి సిల్లీ రీజన్స్ కి కోర్టు విడాకులు మంజూరుచేయదని, పైగా తగిన ఆధారాలు కూడా లేవని పిటిషన్ ను కొట్టిపారేశారట.

Read more RELATED
Recommended to you

Latest news