రాజకీయాలకంటే సినిమాలే బెటర్.. కంగనా షాకింగ్ కామెంట్స్..!

-

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసి పూర్తిగా ప్రజాసేవలోనే ఉంటానని ఇటీవల చెప్పిన ఈమె.. తాజాగా ఓ పాడ్కాస్ట్కు హాజరై సినిమాలపై, రాజకీయాలపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘మా తాత మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆ సక్సెస్ తోనే  మాకు పదేపదే రాజకీయాల నుంచి పిలుపు వచ్చేది. నా ఫస్ట్ మూవీ గ్యాంగ్స్ స్టర్ రిలీజైన వెంటనే నాకు టికెట్ ఆఫర్ చేశారు. నాకు కూడా రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది. కాబట్టే కష్టపడి ఇంత దూరం వచ్చాను. కానీ రాజకీయాల కంటే సినిమాలే ఈజీ. ఇక్కడ ఒక్క మూవీ చేస్తే అంతా మర్చిపోయి రిలాక్స్ అయిపోవచ్చు. కానీ పాలిటిక్స్ అలా కాదు. డాక్టర్స్ లాగా ఇంబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఎప్పటికప్పుడు లీడర్స్ అందుబాటులో ఉండాలి. నేను అలాగే ఉండాలి అనుకుంటున్నాను. నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు హీరోయిన్గా, డైరెక్టర్గా, నిర్మాతగా, రచయిత్రిగా ఉన్నాను. అలాగే.. రాజకీయా జీవితంలోనూ ఉంటాను. ప్రజల మధ్యలోకి వెళ్లాలనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని కలుస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news