శానిటరీప్యాడ్స్ లో డ్రగ్స్ పిల్స్ దాచిపెట్టి తీసుకెళ్లిన యువతి..చూసి షాకైన అధికారులు 

-

డ్రగ్స్..ఇప్పుడు అంతటా పోలీసులకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ముంభై క్రూయిజ్ పిష్ డ్రగ్స్ కేసులో కొన్ని కొత్తవిషయాలు బయటపడ్డాయి. వాళ్లు డ్రగ్స్ ని షిప్ లో తీసుకెళ్లటానికి రకరకాలు మార్గాలు ఎంచుకున్నారట.
 ఈ కేసుకు సంబంధించి విచారణ చేపడుతున్న నార్కోటిక్స్‌ కంట్రోల్ బ్యూరో అధికారులు పలు ఆసక్తికర విషయాలను కనుకున్నారు. షిప్‌లోకి ఓ మహిళ.. డ్రగ్స్‌ను తన శానిటరీ ప్యాడ్‌లలో దాచి తీసుకెళ్లిందని అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. శానిటరీ న్యాప్‌కిన్‌లో దాచి ఉంచి నౌకకు డ్రగ్స్ తీసుకెళ్లినట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. అయితే వీటిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన మున్మున్ ధమేచా రూమ్ నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా అధికారులు చెప్పారు. ఆమె శానిటరీ నాప్‌కిన్స్‌లో డ్రగ్స్ దాచిందని వారు తెలిపారు. ఇలా రకరకాల ‌డ్రగ్స్‌ను నిందితులు షిష్‌లోకి చేర్చారని ఎన్సీబీ చెబుతోంది. ఇక, ఆమె బెయిల్ పిటిషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.
శనివారం ముంబై నుంచి గోవా వెళ్తున్న కార్డెలియా క్రూయిజ్‌ షిప్‌పై అధికారులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అధికారులు దాడులు చేసిన పోలీసుుల ముంబై నుంచి బయలుదేరిన తర్వాత సముద్రం మధ్యలో పార్టీ ప్రారంభమైందని.. ఆ సమయంలో తాము దాడులు చేసినట్టుగా అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి పలువురుని అరెస్ట్ చేసి విచారణ సాగిస్తున్నారు. వారి నుంచి సేకరించిన వివరాల ఆధారంగా మరికొంత మందిని కూడా అరెస్ట్ చేశారు.
ఈ దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరాస్, 22 టాబ్లెట్ల MDMA, 5గ్రాముల MD రూ .1.33 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇక, ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ అధికారులు ఇప్పటివరకు మొత్తం 19 మందిని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news