బ్రేకింగ్ : ఏపీలో కర్ఫ్యూ సడలింపులు కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్…థియేటర్లు ఓపెన్ చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. సీటుకు, సీటుకు మధ్య ఖాళీ ఉండేలా థియేటర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే… రెస్టారెంట్లు, జిమ్స్, కళ్యాణ మండలపాలు… ఇలా అన్నిచోట్లా కోవిడ్ ప్రోటోకాల్స్‌తో అనుమతులు ఇచ్చింది ఏపీ సర్కార్. జనం ఉండే చోట కచ్చితంగా సీటుకు, సీటుకు మధ్య ఖాళీ తప్పనిసరి స్పష్టం చేసింది. శానిటైజర్, మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ.. ఆదేశాలు జారీ చేసింది సర్కార్.
కోవిడ్ విస్తరణను పరిగణలోకి తీసుకుంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఇక అటు తూ.గో, ప.గో జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 7 గంటల వరకూ కర్ఫ్యూ సడలింపులు ఇచ్చిన సర్కార్.. సాయంత్రం 6 గంటలకే దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది. పాజిటివిటీ రేటు 5 లోపు వచ్చేంత వరకూ ఈ రెండు జిల్లాల్లో ఆంక్షల కొనసాగింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉదయం 6 గంటలనుంచి రాత్రి 10 గంటల వరకూ సడలింపులు ఇచ్చింది ఏపీ సర్కార్. ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే… రాత్రి 9 గంటలకు దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.