హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కుట్ర చేస్తున్నారు: హరీష్ రావు

-

ఎమ్మెల్యే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్లీ హైదరాబాద్‌ను ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని చూస్తున్నారని ఆరోపించారు.కరీంనగర్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఇందుకు స్వయంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానిదని,హామీల అమలులో విఫలం చెందిందని ఎద్దేవా చేశారు.

ఈ లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో భూములు కొనేవారు లేకుండా పోయారని,రాష్ట్రం దివాలా తీసిందని, లేని అప్పులు చూపెడుతున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. నేడు రాష్ట్ర ఆదాయం పడిపోయింది. ఉద్యోగాలు రాకుండా పోయాయి.రియల్ ఎస్టేట్ పడిపోయింది. గత ప్రభుత్వాన్ని బాద్నా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ చేసుకున్నాడని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news