బాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి : సీఎం జగన్

-

చంద్రబాబు పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయని మండిపడ్డారు  సీఎం జగన్. కనిగిరిలో నిర్వహించిన ప్రచార సభలో పాల్గొని మాట్లాడారు. 58 నెలలుగా పెన్షన్లను అవ్వాతాతల ఇంటి వద్దనే అందించామని సీఎం జగన్ గర్తు చేశారు. చంద్రబాబ పాపిష్టి కళ్లు వారిపై పడటంతో ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. వాలంటీర్లు పెన్షన్లు పంపిణీ చేయవద్దని.. తన మనిషి నిమ్మగడ్డతో చంద్రబాబే ఈసీకి ఫిర్యాదు చేయించారు. కడుపు మంట చల్లారక వృద్దులు బ్యాంకుల చుట్టూ తిరిగేవిధంగా చేశారు. మేము అధికారంలోకి రాగానే ఇంటి వద్దనే పెన్షన్లు ఇస్తామని చెప్పారు.

జూన్ 04న ఎన్నికల ఫలితాల తరువాత.. తాను అధికారంలోకి రాగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తొలి సంతకం పెన్షన్లపైనే అని సీఎం జగన్ స్పష్టం చేశారు. మాయమాటలతో 2014లో ప్రజలను మోసం చేసిన కూటమి.. ఇప్పుడు మళ్లీ వస్తోందని విమర్శించారు. చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చాడా..? అని ప్రశ్నించారు సీఎం జగన్.

 

Read more RELATED
Recommended to you

Latest news