రాష్ట్రంలో చాలా చోట్ల అసమ్మతి ఉందని, ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 12న అనంతపురంలో రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి హాజరై మీడియా మాట్లాడుతూ…. రాష్ట్రంలో చాలా చోట్ల అసమ్మతి ఉందని, ఆ మాటకొస్తే ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి నియోజకర్గంతోపాటు తనకు కూడా అసమ్మతి ఉందని అన్నారు. అనంతపురంలోని ఓ ఫంక్షన్ హాలులో నిన్న రాప్తాడు నియోజకవర్గ వైసీపీ విస్తృతస్థాయి సమావేశం ఈ వ్యాఖ్యలు చేశారు. అసమ్మతిని పక్కనపెట్టి ప్రతి నాయకుడిని కలుపుకుంటూ ఎన్నికలు వెళ్లాలని సూచించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పత్రికలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేస్తూ వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో రాప్తాడు సీటును ఇతరులకు కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ.. ఎవరైనా సరే ఈ స్థానంలోకి వచ్చి పోరాటం చేస్తామంటే పక్కన కూర్చుని మద్దతు ఇస్తామని అన్నారు.