తెలంగాణ ఎంపీల ఆరోపణల్లో వాస్తవం లేదు – కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి

-

సింగరేణి బొగ్గు గనుల వేలం పై పార్లమెంటులో ఆందోళన చేపట్టారు టిఆర్ఎస్ ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎంపీల ఆందోళన పై స్పందించిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి.. సింగరేణి బొగ్గు గనుల వేలం విషయంలో తెలంగాణ ఎంపీల ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. సింగరేణి సంస్థలో కేంద్రం, తెలంగాణ ఉమ్మడి ఓనర్ షిప్ ఉందన్నారు. అందులో తెలంగాణ ప్రభుత్వానికి 51 శాతం ఓనర్ షిప్ ఉందన్నారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.

 

ఆక్షన్ మొదలైనప్పటి నుంచి ఎవరూ అభ్యంతరం చెప్పలేదన్నారు. పారదర్శకంగా ఆక్షన్ వేస్తున్నామని.. దీనికి అంగీకరిస్తే తెలంగాణ సర్కార్‌కి కూడా ప్రయోజనం ఉంటుందన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు సహకరిస్తున్నాయని.. ఆక్షన్ ద్వారా వచ్చే రెవెన్యూ అంతా రాష్ట్ర ప్రభుత్వాలకు వెళ్తుందని స్పష్టం చేశారు. కోల్ స్కాంలో ఉన్నవాళ్లే ఈ పారదర్శక ఆక్షన్‌ను వ్యతిరేకిస్తున్నారన్నారు ప్రహ్లాద్ జోషి.

Read more RELATED
Recommended to you

Latest news