ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆయా పార్టీలు గెలుపే లక్ష్యంగా ముందుకు ఈ క్రమంలో నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలకు దిగుతున్నారు. తాజాగా గంటా శ్రీనివాసరావుపై భీమిలి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కోరాడ రాజబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రిగా అనేక భూ అక్రమాలకు గంటా శ్రీనివాసరావు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
గంటా ఒక అవినీతిపరుడు. గంటా భూ అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదులు అందాయి అని అన్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో కార్పోరేటర్ పార్టీ టిక్కెట్లు అమ్ముకున్న వ్యక్తి గంటా అని మండిపడ్డారు. బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన చరిత్ర గంటాది” అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.ప్రకాశం జిల్లా నుంచి వలస వచ్చిన నేతకు భీమిలిలో సీటు ఎలా ఇస్తారు?. 4 సంవత్సరాల పాటు పార్టీ కార్యక్రమాలకు గంటా దూరంగా ఉన్నారు. డబ్బున్న వారికే చంద్రబాబు టికెట్ల ఇస్తున్నారు. టీడీపీలో సీట్లకు వేలంపాట పెడుతున్నారు అని ఆరోపించారు. యువతకి 40 శాతం సీట్లు ఇస్తామని అన్నారని గుర్తు చేశారు.స్థానిక కాపులకు ఎందుకు సీట్లు ఇవ్వలేదు” అని రాజబాబు ప్రశ్నించారు.