ఈ ఆహారాలు తింటే గ్లాకోమా రిస్క్‌ తగ్గుతుంది.. లేదంటే దృష్టిలోపం భారినపడాల్సిందే

-

కళ్లు లేని వారి జీవితం శూన్యం.. ఎంత అందమైన రూపాన్ని అయినా వారు ఊహించుకోగలుగుతారే కానీ.. కళ్లారా చూడలేరు.. కళ్లు లేకపోతే.. అసలు ఏదీ సాఫీగా జరగదు.. ఎప్పుడూ ఎవరో ఒకరి మీద ఆధారపడాల్సి వస్తుంది. కొందరికి పుట్టుకతోనే కళ్లు ఉండవు.. మరికొందరికి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా.. కంటి చూపు కొద్ది కొద్దిగా మందగిస్తుంది. గ్లాకోమా ప్రపంచవ్యాప్తంగా అంధత్వానికి రెండవ ప్రధాన కారణం. 60 ఏళ్లు పైబడిన వారిలో అంధత్వానికి ప్రధాన కారణం గ్లాకోమా. అయితే, ఇది ఏ వయస్సు వారైనా ప్రభావితం చేయవచ్చు. పోషకాల లోపం వల్ల కళ్లు అనారోగ్యానికి గురై చూపుపై ప్రభావం చూపుతాయి. కళ్ల ఆరోగ్యం కోసం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కాబట్టి కంటి ఆరోగ్యం కోసం తినాల్సిన కొన్ని ఆహారాలను తెలుసుకుందాం.
ఆకు కూరలు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాయి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బచ్చలికూర వంటి ఆకు కూరలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
నారింజ, నిమ్మ వంటి సిట్రస్ పండ్లు ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ సి, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
క్యారెట్లు జాబితాలో తర్వాతి స్థానంలో ఉన్నాయి. క్యారెట్‌లో బీటా కెరోటిన్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇవి కళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి.
గింజలు మరియు విత్తనాలు ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాయి. విటమిన్ ఇ, సి, జింక్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లతో కూడిన వాటిని తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యానికి కూడా మంచిది.
ఈ జాబితాలో అరటిపండ్లు తర్వాతి స్థానంలో ఉన్నాయి. కంటి ఆరోగ్యానికి మేలు చేసే మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది.
ఈ జాబితాలో చిలగడదుంప చివరిది. విటమిన్ ఏ పుష్కలంగా ఉండే చిలగడదుంపలు తినడం వల్ల కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు.
కేవలం ఆహారాలు తిన్నంతమాత్రానా కళ్లు ఆరోగ్యంగా ఉండిపోవు. వాటికి సరిపడా రెస్ట్‌ ఇవ్వాలి.. అంటే టైమ్‌కు నిద్రపోవాలి.. అలాగే స్క్రీన్‌ ఎక్కువగా చూడకూడదు.. అవసరం అంటే తప్పదు.. కానీ అనవసరంగా స్క్రీన్‌ చూడటం మాత్రం వీలైనంత వరకూ తగ్గించాలి.. అప్పుడే కళ్లు పదికలాల పాటు ఆరోగ్యంగా ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Latest news