ఇకపై హైదరాబాద్ లో కరెంట్, మంచినీటి కష్టాలు ఉండవని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. త్వరలోనే హైదరాబాద్ చుట్టూ మెట్రో సేవలు ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. హైదరాబాద్ 2వ విడత మెట్రోకు తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్ ప్రసంగించారు.
చెన్నై కంటే అనేక ఇతర నగరాల కంటే ముందే హైదారాబాద్ కి కరెంట్ వచ్చిందన్నారు. అద్భుతమైన విశ్వనగరంగా హైదరబాద్ ఉందని వెల్లడించారు. వందకు వంద శాతం రాష్ట్ర ప్రభుత్వ, GMR, HMDA నిధులతో నే ఈ మెట్రో నిర్మాణం అని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.
సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల ఎంతో బాధ పడ్డామని.. మంచినీటి, కరెంట్ బాధలు చూసాము, అనుభవించామని గుర్తు చేశారు. హైదరాబాద్ ను పవర్ ఐలాండ్ గా మార్చానని.. న్యూయార్క్ ,లండన్ లలో కరెంట్ పోవచ్చు కానీ హైదరాబాద్ లో మాత్రం కరెంట్ పోదని తేల్చి చెప్పారు సీఎం కేసీఆర్.