పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా…? తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంకులు ఇవే..!

-

మీరు బ్యాంక్ నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా…? అయితే తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చే బ్యాంకుల వివరాలు ఇక్కడ ఉన్నాయి. మరి ఇప్పుడే దీని కోసం తెలుసుకుని రుణాన్ని పొందండి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే… లోన్ తీసుకోవాలి అని అనుకుంటే ఏ బ్యాంక్ అయితే తక్కువ వడ్డీ రేటుకు రుణం అందిస్తుందో ఆ బ్యాంక్ నుండే తీసుకోవాలి.

అలానే ప్రాసెసింగ్ ఫీజు, ప్రీక్లోజర్ చార్జీలు ఇటువంటి వాటి కోసం కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు అన్నింటి కంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తక్కువ వడ్డీకే రుణాలు వస్తున్నాయి. ఇక్కడ పర్సనల్ లోన్ 8.9 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. ఆ తరువాత పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో వడ్డీ రేటు తక్కువగా ఉంది. అది 8.95 శాతంగా కొనసాగుతోంది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో కూడా ఇదే వడ్డీ రేటు వుంది. దీని తర్వాత ఇండియన్ బ్యాంక్. దీని వడ్డీ రేటు 9.05 శాతంగా ఉంది. బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రలో వడ్డీ రేటు 9.55 శాతంగా ఉంది. ఇది ఇలా ఉండగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో వడ్డీ రేటు 9.6 శాతంగా ఉంది. అలానే యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో 10 శాతం పైన వడ్డీ రేటు ఉంది. వీటిని పరిశీలించి లోన్ తీసుకోవడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news