టాలీవుడ్ హీరోల బెస్ట్ ఫ్రెండ్స్ వీరే..!!

-

ఆగస్టు నెల మొదటి ఆదివారం ఫ్రెండ్ షిప్ డే అని అందరికీ తెలిసిందే. కష్టాల్లో.. నష్టాల్లో.. సంతోషంలో.. బాధలో వెన్నంటి ఉండేవాడు అసలైన స్నేహితుడు అని అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇండస్ట్రీలో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మనం చదివి తెలుసుకుందాం..

ఎన్టీఆర్ – రాజమౌళి :


వీరిద్దరి స్నేహం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా పరిచయమైన వీరిద్దరి స్నేహం ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది. ఒకే ఏజ్ గ్రూప్ కాకపోయినా వీరిద్దరి మధ్య వ్యక్తిగత విషయాలను ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటారు. అంతేకాదు నాటి నుంచి నేటి వరకు వీరి స్నేహం కొనసాగుతూ ఉండడం గమనార్హం. ప్రత్యేకమైన రోజుల్లో కూడా వీరిద్దరూ కలుసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.

రామ్ చరణ్ – రాణా:Childhood buddies with Rana Daggubatiవీరిద్దరూ వెండితెరకు పరిచయం కాకముందే మంచి స్నేహితులు. ఒకరంటే మరొకరికి చాలా గౌరవం. ముఖ్యంగా వీరిద్దరి ప్రాథమిక విద్యాభ్యాసాన్ని ఓకే స్కూల్ నుంచి మొదలుపెట్టారు. ఈవెంట్లో , పార్టీలకు వెళుతూ ఉంటారు . ప్రత్యేకమైన రోజుల్లో స్పెషల్ గా కలుస్తూ ఉంటారు.

ప్రభాస్ – గోపీచంద్:


టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రభాస్కు ఎంతో మంది స్నేహితులున్నా హీరో గోపీచంద్ అంటే ప్రత్యేకమైన అభిమానం.. స్వయంగా ప్రభాసే తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ అని వెల్లడించారు . వీరి స్నేహం అభిమానులకే కాదు సినీ ప్రేక్షకులకు కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ :Pawan kalyan : పవన్ కళ్యాణ్ కథ అమ్మేస్తున్న త్రివిక్రమ్..? | News Orbitపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ కి మధ్య మంచి స్నేహబంధం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి కీలక నిర్ణయాలను త్రివిక్రమ్ తీసుకుంటూ ఉంటారు. చాలావరకు త్రివిక్రమ్ చెప్పిన సలహాలు, సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు పవన్ కళ్యాణ్.

విజయ్ దేవరకొండ – నవీన్ పోలిశెట్టి:
వీరిద్దరి కెరియర్ ఒకేసారి మొదలైంది. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో గోల్డ్ ఫేజ్ యువతగా వెండితెరకు పరిచయమైన వీరు ఆ తర్వాత ఇప్పటికీ స్టార్ హీరోలుగా కొనసాగిన తమ తమ స్నేహబంధం మాత్రం మరవలేదు.

అల్లు అర్జున్ – సుకుమార్:Sukumar to begin Allu Arjun's movie in 10 daysగత కొన్ని సంవత్సరాలుగా వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోంది . ముఖ్యంగా బన్నీ తన పర్సనల్ విషయాలని కేవలం దర్శకుడు సుకుమార్ తో మాత్రమే షేర్ చేసుకుంటారు . ఇక ఖాళీ సమయంలో అల్లు అర్జున్ సుకుమార్ తో సమయం గడపడానికే ఇష్టపడుతూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news