తెలంగాణ భవిష్యత్ ను నిర్ణయించే ఎన్నికలు ఇవి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇవాళ నల్లగొండలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ప్రచార సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం ఆసన్నమైందని తెలిపారు. డబుల్ ఇంజిన్ సర్కారు వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి జరుగుతుందని కేంద్ర హోమంత్రి అమిత్ షా తెలిపారు. అబద్ధపు మాటలతో కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ పూర్తి చేయలేదు. బీసీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో టికెట్లు ఇవ్వలేదు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది.
ఉద్యోగాల పేరిట సీఎం కేసీఆర్ యువతను మోసం చేశారని ఆరోపించారు. స్మార్ట్ సిటీస్ కింద నల్లగొండకు రూ.400 కోట్లు కేటాయించాం అవి ఏం చేశారని ప్రశ్నించారు. బీజేపీని గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని తెలిపారు. ఓవైసీ మెప్పు కోసమే తెలంగాణ ప్రభుత్వం ఉర్దూను రెండో భాషగా గుర్తించిందని తెలిపారు. దళితబంధులో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుంటున్నారు. జాతీయ బీసీ కమీషన్ కి రాజ్యాంగ హోదా కల్పించామని గుర్తు చేశారు అమిత్ షా.