మొదటి సినిమాతో హిట్ కొట్టి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ వీళ్ళే..!

-

ఏ ఒక్కరైనా సరే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత సక్సెస్ఫుల్ గా కెరియర్ ను కొనసాగించాలి అంటే చాలా కష్టం. సినిమా ప్రపంచంలో అవకాశాలు రావాలంటే ఎన్నో కష్టాలు పడాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు వెళ్తే అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది హీరోయిన్స్ మొదటి సినిమాతో విజయం వచ్చినా సరే ఆ తర్వాత మరొక సినిమాలో చేసి ఇండస్ట్రీకి దూరమయ్యారు. మొదటి సినిమాతో మంచి విజయాన్ని అందుకొని.. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్ల గురించి ఇప్పుడు చూద్దాం.

షామిలి:
బాలనటిగా మంచి పేరు సంపాదించి ఆ తర్వాత ఓయ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు.

కార్తీక:
రాధా కూతురిగా జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత దమ్ము సినిమా చేసిన ఈమె ఇప్పుడు టీవీ రంగానికి పరిమితమైంది.

సియా గౌతమ్:
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన నేనింతే సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది . ఆ తర్వాత వేదం సినిమాలో కనిపించిన ఈమె మళ్లీ సినిమాలలో కనిపించలేదు.

నేహా శర్మ:
రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిరుత సినిమాలో హీరోయిన్ గా నటించి.. ఆ తర్వాత ఛాన్స్ లు వచ్చినా సరే నిలబెట్టుకోలేకపోయింది.

గౌరీ ముంజల్:
అల్లు అర్జున్ తో బన్నీ సినిమాలో ఆడి పాడింది. కానీ మళ్ళీ సినిమాలలో నటించలేదు.

మీరా చోప్రా:
పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె ఈ సినిమా పరాజయం కావడంతో ఈమెను పక్కకు పెట్టేశారు

వీరితోపాటు అనురాధ మెహత, భాను శ్రీ మెహ్రా , అన్షు, రిచా వంటి ఎంతోమంది హీరోయిన్లు మొదటి సినిమాతో గుర్తింపు తెచ్చుకొని తర్వాత ఇండస్ట్రీకి దూరం అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news