రాజీవ్‌ గాంధీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..అనుభవం లేదంటూ

-

అనుభవం లేదంటూ రాజీవ్‌ గాంధీపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో మంత్రులుగా పూర్వ అనుభవం లేకుండా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పదవులు చేపట్టిన గొప్ప నాయకులు దేశంలో ఉన్నారు. కొన్ని విశేష రాజకీయ సందర్భాలు ఇలాంటి నేతలకు ఉన్నత పదవులు చేపట్టే అవకాశాలు కల్పిస్తాయని స్వతంత్ర భారత రాజకీయ చరిత్ర చెబుతోందన్నారు. ప్రథమ ప్రధాని జవహర్లాల్‌ నెహ్రూకు 1947 ఆగస్ట్‌ 15న పదవి చేపట్టేనాటికి మంత్రిగా అనుభవం లేదు. 1925–27 మధ్య రెండేళ్లు సొంతూరు అలహాబాద్‌ పట్టణ మున్సిపల్‌ చైర్మన్‌ గా పనిచేసిన అనుభవం అక్కటే నెహ్రూజీకి ఉందని వెల్లడించారు సాయిరెడ్డి.


ఆయన చదువు, స్వాతంత్య్ర సమరయోధునిగా అనుభవం ఆయనను ఉన్నత పదవిలో కూర్చోబెట్టాయి. 1966 జనవరిలో తొలిసారి ప్రధాని అయిన ఆయన కుమార్తె ఇందిరాగాంధీకి కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అప్పటికి ఏడాదిన్నరకు పైగా అనుభవం ఉంది. ఇందిర తర్వాత కాంగ్రెసేతర ప్రధానులైన మొరార్జీ దేశాయి, చౌధరీ చరణ్‌ సింగ్‌ లకు కేంద్ర, రాష్ట్రాల్లో మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. ఇందిర మరణించిన రోజు సాయంత్రమే ప్రధాన మంత్రిగా ప్రమాణం చేసిన ఆమె కుమారుడు రాజీవ్‌ గాంధీ జీకి మంత్రిగా ఎక్కడా పనిచేసిన రికార్డు లేదని వెల్లడించారు.

1981 నుంచి ఆయనకు ఉన్నది లోక్‌ సభ సభ్యత్వం ఒక్కటే. మళ్లీ రాజీవ్‌ మాదిరిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రిగా ఎన్నడూ పనిచేయని మాజీ యంగ్‌ టర్క్‌ చంద్రశేఖర్‌ 1990 చివర్లో దేశ ప్రధాని అయ్యారు. జనతా పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా చంద్రశేఖర్‌ గారికి సుదీర్ఘ నేపథ్యం అప్పటికే ఉంది. చంద్రశేఖర్‌ తర్వాత ప్రధాని పదవి చేపట్టిన ఆరుగురికీ (పీవీ, వాజపేయి, దేవెగౌడ, ఐకే గుజ్రాల్, మన్మోహన్‌ సింగ్, నరేంద్రమోదీ) కేంద్రంలో మంత్రులుగానో, ముఖ్యమంత్రులుగానో పనిచేసిన అనుభవం ఉంది. ప్రధానమంత్రి అయిన ఈ నేతలలో అత్యధిక కాలం (దాదాపు 13 ఏళ్లు) ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీజీది. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి 2004–14 మధ్య కేంద్రంలో తన పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసే అవకాశం వచ్చినాగాని ఆయన ఆ అవకాశం ఉపయోగించుకోలేదని తెలిపారు సాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news