శృంగారంలో తృప్తి లేకపోవడానికి అసలు కారణాలు ఇవే..

-

శృంగారం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైనది.. ఆనందం పొందడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి..కానీ, కొంత మంది ఈ కార్యాన్ని అంతగా అనుభవించలేరు. కొన్నిసార్లు సరైన రొమాన్స్‌ని ఎంజాయ్ చేయలేరు. అందుకు కారణాలు చాలానే ఉంటాయి. మీ పార్టనర్స్‌తో రొమాన్స్‌ బాలేకపోవడం అస్సలు మంచిది కాదు. ఓ వ్యక్తి లైంగికంగా ఆనందంగా, కోరిక లేనప్పుడే ఇది జరుగుతుంది. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. గొడవలకి కారణమవుతుంది. ఇది ఎలాంటి సందర్భాల్లో జరుగుతుంది. ఏయే కారణాలు ఉంటాయి. ఇందుకోసం ఏమేం చేయాలి.. కార్యాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసేందుకు ఎలాంటి టిప్స్ పాటించాలి. పూర్తి వివరాలు తెలుసుకుందాం..

 

ఇద్దరి ఇష్టంతో జరిగితే అది కాస్త నాసాళం ఎక్కుతుందని, బలవంతంగా చేస్తే సరైన సుఖం పొందలేరని నిపుణులు అంటున్నారు.శృంగారం చేయడం అనేది ఇద్దరు పార్టనర్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఇద్దరు కూడా ఎంతలా ఇంట్రెస్ట్‌గా చేస్తే అంతగా ఎంజాయ్ చేస్తారు. కానీ, ఒక్కరే తమకు నచ్చిన పని చేస్తుంటే మరొకరు అలానే ఖాళీగా చూడడం, ఇంట్రెస్ట్ చూపించకపోవడం అనేది అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇద్దరు కూడా మైమరిచి ఈ కార్యంలో పాల్గొనాలని చెబుతున్నారు నిపుణులు..

కొంతమంది ఏదో హడావిడిగా చేస్తారు..వీలైనంత త్వరగా పని పూర్తి చేద్దామా.. అన్నట్లుగా చేస్తారు. ఇలాంటి శృంగారం కూడా అస్సలు మంచిది కాదు కూడా. అందుకే ఆ కంగారుని వదిలేసి కార్యాన్ని ఆస్వాదించాలంటున్నారు..ఇద్దరికీ ఇష్టం ఉన్నప్పుడు సెక్స్ చెయ్యడం వల్ల ఇద్దరికీ లాభలున్నాయట.. ఇకపోతే రొమాన్స్ చేయాలనుకున్న ప్రతిసారి ఈ విషయాన్ని గురించి ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవాలి. కోరికలను పంచుకోవాలి. ఏదైనా ఇబ్బంది ఉందో లేదో తెలుసుకోవాలి. ఎలాంటి సమస్య ఉన్న ముందుగానే తెలుసుకుని వాటిని దూరం చేసేందుకు ప్రయత్నించాలి.అప్పుడే చేసే శృంగారం తృప్తిని ఇస్తుంది.. ఇది తప్పక గుర్తుంచుకోవాలి..

Read more RELATED
Recommended to you

Exit mobile version