బ్రహ్మ ముహూర్తం గురించి ఎవరికీ తెలియని రహస్యాలు ఇవే..!!

-

ఏదైనా ముఖమైన పూజలు, లేదా కార్యాలను బ్రహ్మ ముహూర్తం లో చెయ్యాలి అనే మాట వినే ఉంటాము..దీనీపై చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి.. అసలు బ్రాహ్మముహూర్తం అంటే ఏమిటి ఎందుకు ఆ పేరు పెట్టారు వంటి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే ‘బ్రహ్మముహూర్తం’ అంటారు..

అంటే రోజు మొత్తంలో 29 వది బ్రహ్మ ముహూర్తలు ఉంటాయి..ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98 – 48 నిమిషాల మధ్యకాలం ఇది. నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని పెద్దలు చెబుతున్నారు.

విద్యార్థులు బ్రహ్మ ముహూర్తంలో ఏదైనా చదివితే వారికి ఎలాంటి క్లిష్టమైన విషయం అయినా సులభంగా అర్థం అవుతుంది. ఎక్కువకాలం గుర్తుంచుకుంటారు అని గురువులు తరచూ సూచిస్తారు. అంతేకాకుండా ప్రతిరోజు బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రలేవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతారు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం వల్ల సూర్యుడి నుంచి వెలువడే లేలేత కిరణాలు మనపై ప్రచురించడం వల్ల అధిక మొత్తంలో విటమిన్ డి శరీరానికి పొందవచ్చు.ఈ సమయంలో వాతావరణంలోని ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉంటుంది.. అందుకే ఈ సమయంలో ముఖ్యమైన పనులు చెయ్యాలి.. ఆ ముహూర్తలు గురించి పంతులను అడిగి ప్రారంభించడం మంచిది..

Read more RELATED
Recommended to you

Latest news