ఫ్రిడ్జ్ లో ఈ ఆహారపదార్దాలను అస్సలు ఉంచకూడదు..!

-

చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టిన ఆహారం తింటూ ఉంటారు. కానీ నిజానికి కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు. ఫ్రిజ్ లో ఈ ఆహార పదార్థాలను పెట్టి తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ ఆహార పదార్థాలని అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకండి.

బంగాళదుంపలు:

బంగాళదుంపలు ఎప్పుడు కూడా రూమ్ టెంపరేచర్ లో మాత్రమే ఉండాలి. బంగాళదుంపలను ఫ్రిడ్జ్ లో ఉంచకూడదు ఫ్రిడ్జ్ లో వీటిని ఉంచడం వలన గ్యాస్ ని విడుదల చేస్తాయి.

అరటి పండ్లు:

అరటి పండ్లను కూడా రూమ్ టెంపరేచర్ లో మాత్రమే ఉంచాలి వేడిగా ఉన్నచోట అరటి పండ్లను పెడితే త్వరగా మగ్గుతాయి కూడా. కానీ ఫ్రిడ్జ్ లో మాత్రం అసలు పెట్టకూడదు.

తేనె:

తేనెను కూడా అసలు ఫ్రిజ్లో పెట్టకూడదు తేనెని ఫ్రిజ్లో పెట్టడం వలన కూడా సమస్యలు వస్తాయి. ఎప్పుడైనా సరే తేనెని బయటే ఉంచాలి.

కొత్తిమీర, పుదీనా:

కొత్తిమీర, పుదీనా, తులసి ఇటువంటివన్నీ కూడా మనం ఫ్రిజ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో వీటిని పెట్టడం వలన త్వరగా ఎండిపోతాయి కాబట్టి గ్లాసు నీళ్లలో వాటిని ఉంచండి. డైరెక్ట్ గా సూర్యకిరణాలు పడకుండా చూసుకుంటే చాలు.

కాఫీ:

కాఫీ ని కూడా అసలు ఫ్రిజ్లో పెట్టకండి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో మాత్రమే దానిని స్టోర్ చేయండి.

టమాటాలు:

టమాటాలని కూడా చాలామంది ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటారు కానీ టమాటాలను కూడా అసలు పెట్టకూడదు. ఫ్రిడ్జ్ లో టమోటాలను పెట్టడం వలన వాటి రుచి పోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news