పిల్లలకు జ్ఞాపకశక్తిని పెంచడానికి ఈ పోషకాహారాలు చాలు.. చుర్గుగా ఉంటారట..!

-

మనం తినే ఆహారం వల్లే మన అవయువాలు ఆరోగ్యంగా ఉంటాయనే విషయం అందరికి తెలుసు. మనం తినే ఆహారం వల్లే మెమరీ పవర్ అనేది మెరుగుపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది. దాంతో పిల్లలకు జ్ఞాపకశక్తి పెరగాలని..చిన్నప్పటినుంచే ఏవేవో లేహ్యాలు, మందులు, మెమరీ పవర్ బూస్టర్స్ అనేవి కూడా వాడుతుంటారు. అసలు మెమరీ పవర్ కు మనం తీసుకునే ఆహారానికి సంబంధం ఉందా..ఉంటే ఎంతవరకు ఉంది, ఎలాంటి ఆహారాల ద్వారా వీటిని పొందవచ్చు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

మనం తీసుకునే ఆహారానికి మెమరీపవర్ కి డైరెక్టు సంబంధం ఉంది. మన మెదడు అంతా కొవ్వు, నరలా సముదాయంతో ఉంటుది. ఈ బ్రెయిన్ బాగా పనిచేయాలన్నా, జ్ఞాపకశక్తి పెరగలాన్నా, లెర్నింగ్ ఎబిలిటీ పెరగాలన్నా, బాగా యాక్టీవ్ గా ఉండాలన్నా..మూడు పోషకాలు అతిముఖ్యంగా ఉపయోగపడతాయి. అవి జింక్, ఒమేగా3 ఫ్యాటీయాసిడ్స్, విటమిన్ E.

జింక్ లోపిస్తే..ముఖ్యంగా గర్భవతికి జింక్ లోపిస్తే..పుట్టబోయే బిడ్డల చదువుసంధ్యల మీద, వాళ్ల తెలివితేటలమీద, జ్ఞాపకశక్తిమీద చెడ్డప్రభావం పడుతుంది. పిల్లలకు కూడా జింక్ లోపం ఉంటే..బ్రెయిన్ యాక్టివిటీ తగ్గిపోతుంది. నర్వ్ సెల్స్ సరిగ్గా పనిచేయవు. మెమరీ లాస్ అవడానికి ప్రధాన కారణం జింక్ లోపం అని శాస్త్రవేత్తలు పరిశోధనల ద్వారా నిరూపించారు.

ఒమేగా3 ప్యాటీయాసిడ్స్ నరాలు బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇవి ఎక్కువ ఉన్నవి తింటే..బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మతిమరుపు రాకుండా, అల్జిమర్స్ రాకుండా.బ్రెయిన్ లైఫ్ 150 ఏళ్లు. మనం ఇలాంటి పోషకాలు ఇస్తే..ఆ వయసు వచ్చేవరకూ కూడా చురుగ్గా పనిచేస్తుంది. కానీ మనం సరైన పోషకాలు ఇవ్వకుండా ఉంటాం. వృద్ధాప్యం పెరిగే కొద్ది మతిమరుపు, చురుకుతనం తగ్గిపోతుంది. దానికి కారణం.ఏజ్ అయిపోతుంది కదా.అంతే అనుకుంటాం. అసలు కారణం ఇది…

విటమిన్ E ఎందుకంటే..మెదడులో మనం అనేక రకాల ఆలోచనలు చేసినప్పుడు వివిధ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ బ్రెయిన్ సెల్స్ లైఫ్ ను తగ్గించేస్తాయి. నర్వ్ సెల్స్ లైఫ్ ను డామేజ్ చేస్తాయి. ఈ కెమికల్స్ అన్నింటిని నూట్రలైజ్ చేసి యాంటీఆక్సిడెంట్స్ లాగా పనికొచ్చేది విటమిన్ E.

ఈ మూడు పోషకాలు బాగా అందే నట్స్ , సీడ్స్ మనం తినగలిగితే..చాలా లాభాన్ని మనం పొందవచ్చు.

జింక్ ఏ ఆహారంలో ఎక్కువగా ఉంటుంది.

జింక్ అనేది మనకు 7-10 మిల్లీగ్రాములు అందరికి కావాల్సి ఉంటుంది. 100 గ్రాముల్లో ఉండే పోషకాలు..

ప్రొద్దుతిరుగుడు పప్పు 7 మిల్లీగ్రాముల జింక్ ఉంటుంది
తెల్లనువ్వులు 8మిల్లీగ్రాములు
నల్లనువ్వుల్లో 8.50మిల్లీగ్రాములు
వీటన్నింటికంటే అధికంగా జింక్ ఎక్కువగా ఉండేది..హెంప్ సీడ్స్..జనపనార విత్తనాలు10మిల్లీగ్రాములు
ఇలాంటివి రెగ్యులర్ గా తింటూఉంటే..శరీరానికి జింక్ బాగా అందుతుంది. వీటిని ఎప్పుడు తిన్నా..నానపెట్టుకుని తింటే మంచిది. లేదా వేయించుకుని పొడిచేసుకుని సలాడ్స్ లో తిన్నా లేదా లడ్డులు చేసుకుని తిన్నా మంచిదే.

ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఆహారాలు

ఇది చేపల్లో ఎక్కువగా ఉంటుందని మనకు తెలుసు. చేపల కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉన్న ఆహాలు చాలా ఉన్నాయి. పిల్లలకు ఒమేగా3ఫ్యాటీయాసిడ్స్ ఒకరోజుకు ఒక గ్రాము కావాలి. పెద్దలకు 1.6 గ్రాములు కావాలి. రెండు గ్రాములు తీసుకున్న ఇబ్బంది లేదు.
100 గ్రాముల్లో ఉండే పోషకవిలువలు ఇ‌వి..

వాల్ నట్స్ లో 9 గ్రాములు ఒమేగా3 ఫ్యాటీయాసిడ్స్ ఉంటుంది.
అవిసె గింజలు 13 గ్రాములు ఉంటుంది. ఇవి తక్కువ ఖరీదులో వచ్చేస్తాయి.
చియాసీడ్స్ లో 18 గ్రాములు ఉంటుంది.

ఈ మూడు బాగా తీసుకుంటే మంచిది..అవిసెగింజలు మాత్రం నానపెట్టుకుని తినొద్దు. వేయించుకుని పొడి చేసుకుని సలాడ్స్ లో లేదా..లడ్డులు చేసుకుని తినొచ్చు.

విటమిన్ E ఏ ఆహారాల్లో ఎక్కువగా ఉంటుంది.
మన బాడీకీ 15మిల్లీగ్రాముల విటిమిన్ E కావాలి. 100 గ్రాముల నట్స్ లో ఉండే విటమిన్ E ఎంతంటే..

హజల్ నట్స్ 15మిల్లీగ్రాములు
బాదంపప్పు 28 మిల్లీగ్రాములు
పొద్దుతిరుగుడు పప్పు 35మిల్లీగ్రాములు

ఈ మూడురకాల పోషకాలను పిల్లలు రెగ్యులర్ గా అందిస్తూ..పది నిమిషాలు ప్రాణాయామం చేయించండి. చాలు మెమరీబుస్టర్ పేరుతో మార్కెట్ లో దొరికే కెమికల్ ప్రొడెక్ట్స్ ను వాడి మీ పిల్లలను మీరే అనారోగ్యం భారిన పడేయకుండా ఇలాంటివి తీసుకొచ్చి పెట్టడం వల్ల బోలెడు లాభాలు ఉన్నాయని ప్రముఖ ప్రకృతి వైద్యులు చెబుతున్నారు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news