నల్ల మిరియాలని మనం వంటల్లో వాడుతూనే ఉంటాం. వీటి వల్ల చాలా లాభాలు వున్నాయి. ఆయుర్వేద గుణాలు ఉండే ఈ నల్ల మిరియాలని ఉపయోగించడం వల్ల చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మరి వాటి కోసం ఇప్పుడు తెలుసుకుందాం..
దగ్గు, జలుబు తగ్గుతుంది:
దగ్గు, జలుబు సమస్యలను తగ్గించడానికి నల్ల మిరియాలు బాగా సహాయపడుతాయి. కొద్దిగా నల్ల మిరియాలని తేనె, అల్లం రసం లో వేసుకుని రాత్రి నిద్రపోయే సమయం లో తీసుకుంటే దగ్గు, జలుబు పూర్తిగా తగ్గుతుంది. లేదా మీరు నల్లమిరియాలని టీ చేసుకుని తాగొచ్చు.
క్యాన్సర్ ని తగ్గిస్తుంది:
నల్ల మిరియాల లో క్యాన్సర్ తో పోరాడే గుణాలు ఉంటాయి. ఎందుకంటే నల్ల మిరియాల లో పెపర్ఇన్ అనే కెమికల్ ఉంటుంది. దీని కారణంగా ఇది క్యాన్సర్ తో పోరాడుతుంది. కనుక పసుపుతో పాటు నల్ల మిరియాలను తీసుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది.
నొప్పి తగ్గుతుంది:
నల్ల మిరియాలు తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగుంటుంది. దీనితో నొప్పి రాకుండా ఉంచుతుంది. మీరు కావాలంటే కొద్దిగా నల్ల మిరియాలని నీళ్లలో ఉడికించి నూనె కలిపి మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుంది.
అందం రెట్టింపు అవుతుంది:
నల్ల మిరియాలని పేస్ట్ లాగ చేసి తేనే తో పాటు కలిపి ముఖం మీద అప్లై చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది అదే విధంగా స్క్రీన్ కూడా అందంగా ఉంటుంది.