కరోనా వైరస్ అరికట్టడం విషయంలో దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కంటే వైయస్ జగన్ చాలా తీవ్రస్థాయిలో కృషి చేయడం జరిగింది. ముందుగా ఈ వైరస్ విదేశాల నుండి వచ్చిన వారి వల్ల ఎక్కువ ఇతరులకు సోకుతుందని తేలడంతో గ్రామ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా విదేశీయులను గుర్తించి వాళ్లను ఇంటికి పరిమితం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలకుండా అరికట్ట గలిగారు. దీంతో జగన్ పనితనం గురించి అదేవిధంగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ గురించి జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అయితే ఎప్పుడైతే ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లినవారికి కరోనా వైరస్ పాజిటివ్ లక్షణాలు దేశవ్యాప్తంగా బయటపడటం జరిగిందో అప్పుడే రాష్ట్రంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి చాలామంది ఢిల్లీ మాత ప్రార్థనలకు వెళ్లడంతో … రాష్ట్రంలో ఒక్క సారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. దీంతో వెంటనే ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయింది. దీంతో వ్యక్తిగత పరిశుభ్రత అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ కచ్చితంగా పాటించాలని ప్రజలను అప్రమత్తం చేస్తుంది.
వ్యక్తిగత శుభ్రతలో ఎప్పటికప్పుడు ప్రజలు శానిటైజర్ ద్వారా చేతులు శుభ్రం చేసుకోవాలని లేకపోతే సబ్బుతో అయినా శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చింది. ఇటువంటి తరుణంలో వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు అత్యుత్సాహం చూపుతూ ప్రజలకు వైసిపి పార్టీ జెండా రంగుతో తమ ఫోటోలను శానిటైజర్ డబ్బా లపై ప్రింట్ చేయించుకుని ప్రజలకు పంచిపెడుతూ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. గతంలో వైసిపి పార్టీ రంగులను స్మశానానికి మరుగుదొడ్ల కి పూసినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో చాలామంది ప్రజలు ఇటువంటి కీలకమైన సమయంలో కూడా గత ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్ లు చేసినట్లు వైసీపీ నేతలు చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు. ఇలాంటివి చాలా ఫోటోలు మరియు వైసిపి రంగు ప్రభుత్వం కలిగిన శానిటైజర్ డబ్బాలు సోషల్ మీడియాలో రావటంతో నెటిజన్లు సీఎం జగన్ ఎంత మంచిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఆయన కింద ఉన్న నేతలు చేస్తున్న పనులు జగన్ ని టూ మచ్ బ్యాడ్ చేస్తున్నాయి అని చాలామంది అంటున్నారు. ఇలాంటి విషయాలపై జగన్ దృష్టి పెట్టి నాయకులను కట్టడి చేయాలని కోరుతున్నారు.