పాక్ సహకారంతోనే ఆప్ఘన్ తాలిబన్ల హస్తగతం.. పాప్‌స్టార్ కామెంట్స్..

-

ఆప్ఘనిస్తాన్ దేశం ప్రస్తుతం తాలిబన్ల చేతిలో బందీ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ సమాజం నిశితంగా ఆప్ఘన్ పరిస్థితులను పరిశీలిస్తున్నది. ఇక ఆ దేశంలో ఉంటే ఏం జరుగుతుందోనన్న భయంతో ప్రజలు అక్కడి నుంచి పారిపోతున్నారు. ఫేమస్ సెలబ్రిటీలు కూడా ఆ దేశాన్ని విడిచి వేరే దేశాలకు వెళ్లేందుకుగాను మొగ్గుచూపుతున్నారు. కాబుల్ సిటీని వీడి విదేశాల బాటపట్టిన సెలబ్రిటీల్లో ఒకరు ఆప్ఘన్ పాప్‌స్టార్ ఆర్యానా సయిద్. కాగా, తమ దేశంలో తాలిబన్ల ప్రవేశం, నాశనమవుతున్న తీరుకు పాకిస్థాన్ కారణమని అన్నారు.

పాకిస్థాన్ తాలిబన్లకు అండగా ఉంటోందని కామెంట్స్ చేశారు పాప్ స్టార్ ఆర్యానా. ఈ క్రమంలోనే ఆప్ఘన్ దేశానికి ఇండియా ట్రూ ఫ్రెండ్ అని పేర్కొంది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యానా సయిద్ పలు సంచలన విషయాలు తెలిపింది. పాకిస్తాన్ ఇస్తున్న దారుణ‌మైన ఆదేశాలతోనే తాలిబన్లు దురాగతాలు చేస్తున్నారని చెప్పింది. ఇకపోతే తాలిబన్ల స్థావరాలు పాకిస్థాన్‌లోనూ సజీవంగా ఉన్నాయని సంచలన కామెంట్స్ చేసింది.

పాకిస్తాన్ దేశ‌మే తాలిబ‌న్ల‌కు ట్రైనింగ్ ఇస్తోందంటూ ఆరోపించింది. ప్ర‌త్తుతం కాగా, ఈ పాప్ స్టార్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అయితే, ఆప్ఘన్ దేశ పరిస్థితి‌పై ఆందోళనతో ఆర్యానా సయిద్ ఇలాంటి కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ధైర్యం చేసి కామెంట్స్ చేసింది పాప్ స్టార్ అంటూ ఆమె స్టేట్‌మెంట్స్ చూసి అంటున్నారు. సదరు పాప్‌స్టార్ కామెంట్స్‌పై తాలిబన్లు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.. అయితే, తాలిబన్ల రియాక్షన్ ఎలా ఉన్నప్పటికీ పాప్ స్టార్ ఆర్యానా సయిద్ అయితే ఆప్ఘన్ దేశంలో లేరని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తోంది. ఎప్పుడో ఆప్ఘన్ నుంచి వేరే ప్రదేశానికి వెళ్లి అక్కడి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news