నష్టాల్లో టీఎస్ ఆర్టీసీ.. అందని వేతనాలు

Join Our Community
follow manalokam on social media

ఫిబ్రవరి రెండోవారం గడుస్తున్నా టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదు. గత నెలలో 12వ తేదీన జీతం చెల్లించారు. ఈ నెల జీతం చెల్లించడానికి మరికొద్ది రోజులు ఎదురు చూసే పరిస్థితి నెలకొని ఉంది. ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి నిధులు లేవని, జీతాల కోసం రూ.20 కోట్లు మాత్రమే ఉన్నట్లు సమాచారం. మరో రూ.100 కోట్లు ఆర్థిక శాఖ నుంచి విడుదల కావాల్సి ఉంది. ఆర్థిక శాఖ నుంచి నిధులు అందకపోవడంతోనే ఆలస్యమైంది. ఈ మేరకు నిధులను విడుదల చేయాలని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి కోరారు.

tsrtc
tsrtc

కరోనా వల్ల బస్సుల్లో ప్రయాణాలు తగ్గాయి. అయితే గతంతో పోలిస్తే ఈ మధ్య ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో పెరిగింది. రోజువారీ ఆదాయం రూ.12 కోట్లు వస్తోందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. రోజువారీ ఖర్చులు పోనూ జీతానికి రూ.20 కోట్లు పక్కన పెట్టుకుంది. గత నెలలో కూడా కొంచెం డబ్బు ఉండటంతో.. ఉన్నంతలో కొందరికి జీతాలు చెల్లించి.. మరికొందరికీ ప్రభుత్వం నిధులు అందించారు. దీంతో కొంత గందరగోళం ఏర్పడింది. అందుకే ఈ సారి అందరికీ ఒకే సారి జీతాలు ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది.

ఈ నెల 11వ తేదీ వరకు ఆర్టీసీ ఆదాయం రూ.118 కోట్లు సమకూరింది. అయినా ఉద్యోగులకు ఫిబ్రవరి రెండోవారం ముగుస్తున్నా జీతాలు చెల్లించకపోవడం దారుణమని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ఆరోపించారు. వేతనాలు సరైన సమయానికి చెల్లించకపోవడం.. వేతన సవరణ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయని ఆర్టీసీ సంఘాలు అధికారులపై ఆరోపణ చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మిక సంఘాలు ఆందోళనకు కూడా దిగారు.

వేతనాలు చెల్లింపు విషయంపై టీఎంయూ, ఈయూ సంఘాలు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై చర్చలు జరిపేందుకు టీఎస్ ఆర్టీసీ స్టాప్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈ నెల 20వ తేదీ రాష్ట్ర సదస్సు నిర్వహించనుందని అధ్యక్షడు రాంచందర్, ప్రధాన కార్యదర్శుడు వీఎస్ రావు తెలిపారు. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన కార్మిక శాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షుడు బాబు, ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి ప్రకటించారు. తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన చలో బస్ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.

TOP STORIES

శనిత్రయోదశి రోజు ఏం చేయాలి?

శనిదేవుడు అంటేనే మనకు భయం. ఎందుకంటే శనిదేవుడు మన జన్మరాశిలోకి ప్రవేశిస్తే ఏడు ఏళ్లు మనకు కష్టాలు కలుగుతాయనే నమ్మకం. నిజానికి శనిదేవుడు మంచివాడు. శని...