పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలనుకుంటున్నారా..? రూ. 1 కంటే తక్కువ వడ్డీ రేట్లు ఇచ్చే బ్యాంకులు ఇవే..!

-

లోన్‌ తీసుకోవాలి అనుకున్నప్పుడు మనం ముందుగా ఆలోచించేది.. వడ్డీ గురించే. వడ్డీ ఎక్కువగా ఉంటే మనపై భారం ఎక్కువగా పడుతుంది. అందుకే ఏ బ్యాంకులో తక్కువ వడ్డీ ఉంటే అందులో లోన్‌ అప్లై చేస్తాం. ఒకవేళ అది రిజక్ట్‌ అయితే మళ్లీ వేరేది. అయితే మనకు ముందు అసలు ఏ బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లకే రుణాలు ఇస్తాయో తెలుస్తాయి. బ్యాంకుకు వెళ్లి అడిగితే అన్నీ మేమే తక్కువకు ఇస్తాం అంటారు. ఈరోజు మనం రూపాయి కన్నా తక్కువ వడ్డీకు రుణాలు ఇచ్చే బ్యాంకులు ఏంటో, అక్కడ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చూద్దామా.!

బ్యాంక్ ఆధారంగా పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు కూడా మారుతుంది. అందుకే బ్యాంక్ ఎంపికలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ప్రాసెసింగ్ ఫీజు సహా ఇతర చార్జీలు ఎలా ఉన్నాయో కన్నేసి ఉంచాలి. లేదంటే నష్టపోవాల్సి రావొచ్చు. ఈ లిస్ట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు రెండూ కూడా ఉన్నాయి. వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.

బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర తక్కువ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తోంది. ఈ బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే గరిష్టంగా 84 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వడ్డీ రేటు 10 శాతం నుంచి ప్రారంభం అవుతోంది.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా వడ్డీ రేటు తక్కువగానే ఉంది. ఈ బ్యాక్‌లో పర్సనల్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 10.25 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. ఈ బ్యాంక్‌లో కూడా లోన్ టెన్యూర్ 84 నెలల వరకు పెట్టుకోవచ్చు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఆపర్ చేస్తోంది. పీఎన్‌బీ బ్యాంక్‌లో లోన్ తీసుకోవాలని భావిస్తే.. వడ్డీ రేటు 10.4 శాతం నంచి ప్రారంభం అవుతోంది. 60 నెలల వరకు ఈఎంఐ పెట్టుకోవచ్చు. గరిష్టంగా 16.95 శాతం వరకు వడ్డీ రేటు ఉంటుంది.

యాక్సిస్ బ్యాంక్‌లో చూస్తే ఇందులో కూడా తక్కువ వడ్డీ రేటు ఉంది. ఈ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్‌పై వడ్డీ రేటు 10.49 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 60 నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. గరిష్టంగా 22 శాతం వరకు వడ్డీ పడొచ్చు.

ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో కూడా తక్కువ వడ్డీ రేటుతో రుణాలు పొందొచ్చు. ఈ బ్యాంక్‌లో పర్సనల్‌ లోన్స్ పై వడ్డీ రేటు 10.5 శాతం నుంచి ప్రారంభం అవుతోంది. గరిష్టంగా 24 శాతం వరకు వడ్డీ ఉంటుంది.

అందుకే బ్యాంక్‌ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు చెక్ చేసుకోవాలి. వడ్డీ రేటు పెరిగితే ఈఎంఐ భారం కూడా పెరుగుతుంది. తక్కువ వడ్డీ ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోవడం ఉత్తమం. అలాగే బ్యాంకులో పర్సనల్‌ లోన్‌ తీసుకోవాలంటే మీతో పాటు మీరు ఉద్యోగం చేస్తున్న కంపెనీ కూడా చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు చేసే కంపెనీ రిజిస్టర్‌ అయి చాలా ఏళ్లు గడిస్తే వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. అలా కాకుండా స్టాటప్‌ అయినా పదేళ్ల లోపు అయితే వడ్డీ రేట్లలో మార్పు ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news