హైదరాబాద్ లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. గేట్లు విరగ్గొట్టి … ఎన్ కన్వెన్షన్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు అల్లు అర్జున్ అభిమానులు ప్రయత్నించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… అభిమానులను చెదరగొట్టారు. అయితే.. పోలీసులు మరియు అల్లు అర్జున ఫ్యాన్స్ మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది.
ఈ తోపులాట లో పలువురి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు కూడా గాయాలు అయినట్లు సమాచారం అందుతోంది. ఇద్దరికీ ఫ్యాన్స్ కాళ్ళు కూడా విరిగాయని తెలుస్తోంది. దీంతో ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అల్లు అర్జున్ తో ఫోటో దిగే ఛాన్స్ మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో ఉందంటూ… ఇవాళ బన్నీ ఫ్యాన్స్ కు మెసేజ్ లు వెళ్లాయి. ఈ నేపథ్యంలోనే.. అభిమానులందరూ.. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ కు చేరుకున్నాయి. అయితే.. చివరి క్షణంలో ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో ఆగ్రహానికి లోనయ్యారు బన్నీ ఫ్యాన్స్. ఈ నేపథ్యలోనే.. ఈ సంఘటన చోటు చేసుకుంది.