బట్టలపై పడే రకరకాల మరకలను ఇలా తొలగించేయండి..!

-

ఎంతజాగ్రత్తగా ఉన్నా..కొన్నిసార్లు తినేప్పుడు, తాగేప్పడు..ఇంకేదానా పనిచేసేప్పుడు బట్టలపై వివిధరకాల మరకలు పడతుంటాయి. అయితే వీటిలో కొన్ని ఈజీగా పోతాయి..కానీ మరికొన్ని అసలు వదలవు. ఇక ఆ దుస్తులను ఇంట్లో వేసుకోవడం తప్ప బయటవేసుకుని తరిగలేం.కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే చక్కటి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. మరి, ఇంతకీ ఏ మరక ఎలా తొలగించాలో ఇప్పుడు చూద్దాం.

రంగు మరకలు

రంగు పోయే దుస్తుల్ని ఇతర దుస్తులతో కలిపి నానబెట్టినప్పుడో, వాషింగ్‌ మెషీన్‌లో ఉతికేటప్పుడు వాటి రంగు మిగతా వాటికి అంటుకుంటుంది. ముఖ్యంగా తెలుపు రంగు దుస్తుల విషయంలో ఎక్కువగా ఇలా జరుగుతుంటుంది. అయితే ఎంత ఉతికినా ఈ రంగు ఓ పట్టాన వదలదు. ఇలాంటప్పుడు ఒక చిన్న తెల్ల గుడ్డ ముక్క తీసుకొని.. దానిపై హెయిర్‌ స్ప్రే, రబ్బింగ్‌ ఆల్కహాల్‌ లేదంటే 90 శాతం ఆల్కహాల్‌ ఉన్న ఏదైనా ద్రావణం పోసి.. దాంతో మరక పడ్డ చోట పదే పదే తుడుస్తుండాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మరక పోతుందట. ఆపై దీన్ని సాధారణంగా ఉతికి ఆరేస్తే సరిపోతుంది.

రక్తపు మరకలు

నెలసరి సమయంలో బ్లీడింగ్‌ ఎక్కువైనా.. ఏదైనా గాయం తగిలినా.. ఆ మరకలు దుస్తులపై పడుతాయి..ఇక ఇవి ఎంత రుద్దిగా పూర్తిగా పోవు. లైట్ గా అలానే ఉంటాయి.. అలాంటప్పుడు వీటిని డిటర్జెంట్‌ పౌడర్‌ కలిపిన నీటిలో అరగంట పాటు నానబెట్టి.. సాధ్యమైనంత వరకు చేత్తో రద్దాలి. ఇక ఇలా వదలట్లేదు అనుకున్నప్పుడు.. దానిపై Enzymatic Stain Remover ఇది మార్కెట్ లో అందుబాటులో ఉంటుంది. ఇది వేసి కాసేపు అలా వదిలేయాలి. ఆపై రుద్దుతూ ఉతికేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇలా చేసినా మరక వదలకపోతే మాత్రం.. దానిపై ఒకట్రెండు చుక్కల హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ వేసి ఉతికితే ఫలితం ఉంటుంది. అయితే దీనివల్ల కొన్ని రకాల దుస్తులు రంగు వెలిసిపోయే అవకాశం ఉంది. కాబట్టి వాడే ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేయడం మంచిది. అది కూడా చాలా తక్కువ మొత్తంలోనే వాడలి.

నూనె మరకలు

వంట చేసే క్రమంలో దుస్తులపై నూనె మరకలు పడుతుంటాయి. వీటిని పోగొట్టడానికి..ముందుగా దుస్తుల్ని చల్లటి నీళ్లలో ముంచి తీయాలి. ఆపై మరక ఉన్న చోట డిష్‌వాషింగ్‌ సబ్బు/లిక్విడ్‌ని వేసి బాగా రుద్దాలి. ఇలా మరక పూర్తిగా తొలగిపోయే వరకు రుద్దాలి. లేదంటే బేకింగ్‌ సోడాను మరకపై చల్లి.. అరగంట తర్వాత బ్రష్‌తో రుద్దాలి. ఇప్పుడు వెనిగర్‌, నీళ్లు కలిపిన మిశ్రమాన్ని స్ప్రే చేసి కాసేపటి తర్వాత ఉతికేస్తే మరక పూర్తిగా వదిలిపోతుంది.

పాల మరకలు

పాలిచ్చే తల్లులకు ఎక్కువ మొత్తంలో పాలు ఉత్పత్తవడం వల్ల అవి లీకై దుస్తులపై మరకలు పడుతుంటాయి. వాటిని తొలగించడానికి.. ముందుగా బ్రష్‌తో ఆ మరకపై రుద్దండి. ఆపై డిటర్జెంట్‌ వేసిన చల్లటి నీటిలో అరగంట పాటు నానబెట్టాలి. తద్వారా ఫలితం ఉంటుంది. ఇదనే కాదు.. సాధారణ పాల మరకలు, కోడిగుడ్డు సొన మరకలు వదిలించుకోవడానికి కూడా ఈ చిట్కాను పాటించచ్చు.

వీటిని ఇలా తొలగించచ్చు!

వెనిగర్‌, నీళ్లు కలిపిన మిశ్రమంతో మట్టి మరకలు, పచ్చగడ్డి వల్ల దుస్తులపై పడిన మరకల్ని సైతం వదిలించచ్చు.
అధిక చెమట కారణంగా చంకల కింద మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించాలంటే.. కప్పు వెనిగర్‌ని రెండు కప్పుల గోరువెచ్చటి నీటిలో కలిపి.. ఈ మిశ్రమంలో ఆ దుస్తుల్ని అరగంట పాటు నానబెట్టి ఉతికితే సరిపోతుంది.
సిరా మరకలు పడిన చోట పేపర్‌ టవల్‌తో అద్ది.. ఆ తర్వాత దానిపై హెయిర్‌ స్ప్రే చేసి కొన్ని నిమిషాల తర్వాత ఉతికేస్తే సరిపోతుంది.

-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news