తెలంగాణ సమాజానికి ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తి ఇదీ..!

-

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమవుతున్నారుతమ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారుఅసలు తాము సమ్మెకు ఎందుకు దిగామో వారు ఓ లేఖ ద్వారా ప్రజలకు వివరిస్తున్నారువారి వాదన ఏంటంటే..

మేము సమ్మె చేయడానికి దారి తీసిన పరిస్థితులు కూడా మీకు తెలవాలిమన ప్రియతమ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఉద్యమ సమయములో తెలంగాణ వస్తే మన బ్రతుకులు బాగుపడతాయని ఎన్నో ఆశలు చూపించి సకలజనుల సమ్మె లో మొట్టమొదట మమ్ముల్ని పాలుగోనేటట్లు చేసి అందరి కృషి వల్ల తెలంగాణ వచ్చినతరువాత మమ్మల్ని పూర్తి గా మరిచి పోయారు!

సకల జనుల సమ్మెలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులకు సమ్మె చేసిన రోజులకు ప్రత్యేక సెలవులు గా ప్రకటించిందికానీ మా ఉద్యోగులకు మాత్రం చేసిందీ ఏమి లేదు
TSRTC గా ఏర్పడిన తరువాత మా సంస్థకు కనీసం పూర్తి స్థాయి MD ని కూడా ఇంతవరకు నియమించలేదు అంటే మీరు నమ్మండి!

ఇక మా సంస్థ గురించి చెప్పాలంటే ప్రభుత్వం నెలకు మాదగ్గర సుమారు 750 కోట్లు పన్నుల రూపంలో ముక్కు పిండి వసూలు చేస్తుంది కానీ మాకు అంటే సంస్థకు చెల్లించాల్సిన వివిధ రాయితీల డబ్బు మాత్రంచెల్లించడంలేదు ! RTC సేవా సంస్థ కానీ ఈ ప్రభుత్వం మాత్రం సంస్థ పట్ల సవతిప్రేమ చూపెడుతుంది ఎలాగంటే ఒక ఉదాహరణ RTC ఉపయోగించే డీజల్ పైన లీటరుకు 23 రూ/- పన్ను వసూలు చేస్తుంది అదే విమానాలకు ఉపయోగించే డీజల్ పైన కేవలం 5/- లీటరుకు వసూలు చేస్తుంది !

పక్క రాష్ట్రం AP లో బడ్జెట్లో సుమారు 3వేలకోట్ల కేటాయిస్తేఇక్కడ గత సంవత్సరం 500 కోట్లు కేటాయిస్తే ఈసారి అది కూడా లేదు ఇంతే కాకుండా ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం ఇవ్వాలని వాటికి వచ్చే ఆర్థిక నష్టం కూడా ప్రభుత్వం భరించకుండా ఆర్టీసీ కార్మికులనే బాధ్యులను చేస్తున్నారు మరియు విద్యార్థుల కు ఇచ్చే సబ్సిడీ కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే

తెలంగాణ ఏర్పడ్డ తరువాత 68శాతం ఉన్న 0R.. 73 కు పెరిగింది అయిన నష్టాలు తగ్గడం లేదు కార్మికులు పనిభారం పెరిగి ఒత్తిడి ఎక్కువయి తనువుచాలిస్తున్నారుసంస్థను బ్రతికించు కోవాలంటే సమ్మె తప్ప మరో మార్గం కనబడలేదు ! .. ఇదీ ఆర్టీసీ కార్మికుల వాదన.

Read more RELATED
Recommended to you

Latest news