హౌసింగ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ బ్యాంకులు బెస్ట్..!

-

ఎప్పుడు నుండో సొంత ఇల్లు కట్టుకోవాలన్న ఆశ కలగానే మిగిలిపోయిందా..? మరి మీరు సొంతింటి కల సాకారం చేసుకోవాలని అనుకుంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చెయ్యచ్చు. ఇలా మీ దగ్గర సరిపడా డబ్బులు లేక పోయిన కలని నిజం చేసుకోవచ్చు. మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

 

ఏ బ్యాంక్‌ లో తక్కువ వడ్డీకే లోన్ లభిస్తోందో తెలుసుకోవాలి. అప్పుడు మీరు ఆ బ్యాంక్ లో లోన్ తీసుకుంటే మీకు తక్కువ వడ్డీకే లోన్ వస్తుంది. ఇక ఏయే బ్యాంక్స్ లో ఎంత వడ్డీకి లోన్ వస్తుంది అనేది చూసేస్తే..

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్‌లో తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ని మీరు పొందొచ్చు. ఈ బ్యాంక్ లో వడ్డీ రేటు 6.65 శాతం ప్రారంభమౌతోంది. అదే బ్యాంక్ ఆఫ్ బరోడాలో 6.75 శాతం నుంచి, పీఎన్‌బీలో 6.8 శాతం నుంచి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.85 శాతం నుంచి హోమ్ లోన్ స్టార్ట్ అవుతోంది.

ఇది ఇలా ఉంటే యూకో బ్యాంక్‌, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 6.9 శాతం నుంచి వడ్డీ రేట్లు ప్రారంభం అవుతున్నాయి. దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో SBI వడ్డీ రేటు 6.95 శాతం నుంచి ప్రారంభమౌతోంది.

కెనరా బ్యాంక్‌లో వడ్డీ రేటు 6.9 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది. బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 6.85 శాతంగా ఉంది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో వడ్డీ రేటు 6.75 శాతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌ లో వడ్డీ రేటు 6.9 శాతం నుంచి మొదలవుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ వడ్డీ రేటు 7 శాతం నుంచి స్టార్ట్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news