సులభమైన గణపతి ప్రార్థన ఇదే !!

-

గణపతి పుట్టిన రోజు. వినాయక చవితి. ఈ రోజు స్వామని ఎవరైతే భక్తితో శ్రద్ధతో పూజిస్తారో, ధ్యానిస్తారో వారికి స్వామి అనుగ్రహం లభిస్తుందనడంలో సందేహం లేదు. అయితే స్వామని పూజించడానికి అతి సులభమైనవి, అందరూ పటించదగిన శ్లోకాలు తెలుసుకుందాం..

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ॥
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం ।
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే ॥
ఖర్వం స్థూలతనుం గజేంద్రవదనం లంబోదరం సుందరం
ప్రస్యం దన్మథులుబ్ధ మధుపవ్యాలోల గండస్థలమ్
దంతాఘాత విదారితాం రుధిరైః । సింధూర శోభాకరం
వందే శైలసుతాసుతం గణపతిం సిద్ధిప్రదమ్ కామదమ్ ॥

నీకు మ్రొక్కెదన్

తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపులు మందహాసమున్
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడు పార్వతీతనయ యోయి గణాధిప నీకు మ్రొక్కెదన్ ॥
తలచెదనే గణనాధుని, తలచెదనే విఘ్నపతిని, దలచిన పనిగా
దలచెదనే హేరంబుని, దలచెద నా విఘ్నములవి తొలగుట కొరకున్ ॥
అటుకులు కొబ్బరి పలుకులు చిటిబెల్లము నానబ్రాలు చెరకురసంబున్
నిటలాక్షు నగ్రసుతునకు బటుతరముగ విందుచేసి ప్రార్థింతుమదిన్ ॥
– పై శ్లోకాలను భక్తి శ్రద్ధలతో పిల్లలతో పఠింపచేస్తే తప్పక స్వామి అనుగ్రహం కలిగి విఘ్నాలు తొలగి సకల విద్యలు సులభంగా వస్తాయి.

– శ్రీ

Read more RELATED
Recommended to you

Latest news