కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న కిడ్నీ సంబంధిత రుగ్మతతో బాధపడుతూ నాలుగు రోజుల కిందట అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స అందిస్తుండగానే గుండెపోటు రావడంతో ఆదివారం సాయన్న కన్నుమూశారు. అయితే సాయన్న నివాసం నుంచి వెస్ట్ మారేడుపల్లి లోని స్మశాన వాటిక వరకు ఆయన అంతిమయాత్ర కొనసాగింది. మరి కాసేపట్లో అంత్యక్రియలు పూర్తవుతాయి అనగా ఆయన అనుచరులు అకస్మాత్తుగా ఆందోళనకు దిగారు.
అధికార పార్టీ ఎమ్మెల్యే సాయన్నకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించాలంటూ మెరుపు ధర్నాకు దిగారు. అక్కడే ఉన్న మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వినిపించుకోలేదు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో మంత్రులు అక్కడ నుండి వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్యే సాయన్నకు అధికారిక లాంచనాలతో అంత్యక్రియలు జరపకపోవడంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇది కేసీఆర్ అహంకారానికి పరాకాష్ట అని పేర్కొన్నారు. ఇలా చేయడం రాష్ట్రంలోని దళితులను అవమానపరిచినట్లేనని అన్నారు ఈటెల.