ఈ సంవత్సరాల్లో ఉన్న రూ.2 కాయిన్స్ మీ దగ్గర ఉన్నాయా.. అయితే రూ. 5లక్షలు మీవే..!

-

పాతవాటికి ఎప్పటికైనా విలువ ఉంటుంది. చాలామందికి పాత స్టాంప్స్, కాయిన్స్ కలక్షన్స్ అలవాటు ఉంటుంది. ఒకవేళ మీకు ఆ అలవాటు ఉంటే..ఈ వార్త మీకు బాగా ఉపయోగపడుతుంది. పాత వస్తువులను చాలామంది పట్టించుకోరు. పారేస్తుంటారు. తాజాగా ఓ వృద్ధురాలు అలానే పాతనగలే అనుకుని వేలం పాట పెడితే.. అందులో ఎందుకు పనికిరాని రాయి విలువు 22కోట్ల వరకూ ఉంటుందని అంచనా వేశారు. ఇలా పాతవాటికి, మనం ఎందకు ఉపయోగపడవు అనుకునేవి కొన్నాళ్లకు యాంటిక్ పీసెస్ గా మారుతాయి.

2 rupee coins

అంతర్జాతీయ మార్కెట్‌లో పురాతన వస్తువులకు చాలా డిమాండ్ ఉంటుంది. ఒకవేళ పురాతన వస్తువులు మీ దగ్గర ఉంటే మాత్రం… వాటి ద్వారా మీరు డబ్బు సంపాదించవచ్చు.. మీ పాత కరెన్సీకి ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున… ఈ నాణేల నుండి మీరు సులభంగా డబ్బు సంపాదించుకోవచ్చు.

మీ దగ్గర పాత 2 రూపాయల కాయిన్ ఉందా..? ఒకవేళ ఉంటే.. ఈ కాయిన్ ద్వారా ఆన్‌లైన్‌లో అక్షరాల 5 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. కానీ.. ఇందులో ఉన్న తిరకాసు ఏంటంటే ఈ నాణెం లేదా కాయిన్ సీరీస్ 1994, 1995, 1997 లేదా 2000 మాత్రమే ఉండాలి. ఈ సీరీస్ గల కాయిన్ మీ దగ్గర ఉంటే 5 లక్షలు మీ సొంతం అవుతాయి.

ఈ నాణెం ఎలా అమ్మాలంటే..?

2-rupee-coins1.jpg

ఒకవేళ మీ వద్ద ఈ 2 రూపాయల నాణెం ఉంటే, మీరు OLX ద్వారా ఆన్‌లైన్‌లో అమ్మవచ్చు. ఈ వెబ్‌సైట్‌లో అరుదైన కాయిన్స్ కి భారీ మొత్తంలో చెల్లించి వీటిని కొంటున్నారు. కాయిన్స్ అమ్మటానికి ముందుగా మీరు OLXలో అమ్మకం దారుడిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత, నాణెం యొక్క రెండు వైపుల ఫోటోను తీసి..OLX వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ మరియు ఈ-మెయిల్ ఐడీని నమోదు చేసుకోండి. వెబ్‌సైట్‌లో మీరు అందించిన సమాచారాన్ని వెరిఫై చేసుకోండి.

వెబ్‌సైట్ ప్రకారం, మీరు అదృష్టవంతులైతే, కాయిన్ కొనాలనుకునే వారు నేరుగా మిమ్మల్నే సంప్రదిస్తారు. నిబంధనల ప్రకారం, పాత కాయిన్ తీసుకొని.. మీకు డబ్బులు చెల్లిస్తారు. భారతదేశంలో మొదటిసారిగా 1982లో 2 రూపాయల కాయిన్ ప్రవేశపెట్టబడింది. పాత 2 రూపాయల కాయిన్స్ కుప్రో-నికెల్ మెటల్‌లో ముద్రించబడ్డాయి. మన దేశంలో గత కొన్నేళ్లుగా చాలా నాణేల తయారీ నిలిచిపోయిన కారణంగా ఈ రకంగా కాయిన్స్ విలువ ఒక రేంజ్ లో పెరిగింది.

అయితే..ఈ కాయిన్స్ మీ దగ్గర ఉంటే..అమ్మే క్రమంలో మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. తొందరపడి కాయిన్స్ ఇచ్చేసి మోసపోతే..లబోదిబోమన్నా ఫలితం ఉండదు.

– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news