బోయినపల్లి కిడ్నాప్ కేసులో 11 మంది అరెస్ట్..రహస్య ప్రాంతంలో ?

-

హైదరాబాద్ బోయినపల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి 11మంది కిడ్నాపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. అలాగే ఈ కేసుకు సంబంధించి అఖిలప్రియ సోదరుడి ప్రమేయం ఉందా ? లేదా అనే విషయం మీద దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కిడ్నాపర్ల కోసం బెంగళూరు చెన్నై, పూణే లాంటి నగరాల్లో గాలించిన పోలీసులు 15 బృందాలతో కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

అదుపులోకి తీసుకున్న 11 మంది కిడ్నాపర్లను రహస్య ప్రాంతంలో ఉంచిన నార్త్ జోన్ పోలీసులు కిడ్నాప్ చేసిన విధానం మీద విచారిస్తున్నట్లు సమాచారం. అయితే అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ అలాగే వీరి ప్రధాన అనుచరుడు గుంటూరు శ్రీను ఇంకా దొరకలేదని తెలుస్తోంది. వీరి కోసం పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టారు. ఇక మరో పక్క ఈ కిడ్నాప్ కేసు కు సంబంధించి అఖిలప్రియకు పోలీస్ కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈరోజు అఖిలప్రియకు వైద్య పరీక్షలు నిర్వహించనున్న పోలీసులు మధ్యాహ్నం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news