ఏకంగా రూ.16,400 ప‌లికిన కేజీ టీ పొడి.. ఇంత‌కీ ఏంటది..?

-

సాధార‌ణంగా మ‌నం రోజూ తాగే టీ పొడి ధ‌ర త‌క్కువ‌గానే ఉంటుంది. రూ.1000 లోపే ఆ పొడి ధ‌ర ఉంటుంది. ఇక కొన్ని ప్ర‌త్యేక‌మైన టీ పొడులు అయితే రెట్టింపు ధ‌ర‌లు ప‌లుకుతాయి. కానీ ఆ టీ పొడి మాత్రం కేజీకి ఏకంగా రూ.16,400 ధ‌ర ప‌లికింది. ఓ అంత‌ర్జాతీయ టీ పొడి వేలం పాటలో వేలం నిర్వ‌హించ‌గా ఆ పొడికి అంత‌టి ధ‌ర వ‌చ్చింది.

టీ పొడి
టీ పొడి

త‌మిళ‌నాడులోని నీల‌గిరి జిల్లాలో ఉన్న కోనూర్ అనే ప్రాంతంలో ఓ ప్రైవేటు టీ ఫ్యాక్ట‌రీ వారు సిల్వ‌ర్ నీడిల్ టీ అని ప్ర‌త్యేక‌మైన టీ పొడిని త‌యారు చేస్తారు. 10 ఎక‌రాల టీ తోట‌లో ఆకుల నుంచి కేవ‌లం 5 కేజీల సిల్వ‌ర్ నీడిల్ టీ పొడి మాత్ర‌మే వ‌స్తుంది. ఆ ఆకుల‌ను సూర్యాస్త‌మ‌యంలోపే సేక‌రించాలి. అది కూడా వాటిపై మంచు ప‌డి ఉండాలి. ఈ క్ర‌మంలో సేక‌రించిన టీ ఆకుల‌ను ప్రాసెస్ చేసి 5 కేజీల టీ పొడిని ఏటా త‌యారు చేస్తారు. అందులోంచి 1 కేజీ టీ పొడిని ద‌గ్గ‌ర ఉంచుకుంటారు. మిగిలిన 4 కిలోల టీ పొడిని వేలంలో విక్ర‌యిస్తారు.

ఇక తాజాగా కోనూర్ టీ ట్రేడ్ అసోసియేష‌న్ (సీటీఈఏ) వారు అంత‌ర్జాతీయంగా నిర్వ‌హించిన వేలం పాట‌లో స‌ద‌రు సిల్వ‌ర్ నీడిల్ టీ పొడికి కూడా వేలం పెట్టారు. దీంతో ఓ కంపెనీ వారు ఆ టీ పొడికి అత్య‌ధికంగా కేజీకి రూ.16,400 ధ‌ర పాడి దాన్ని ద‌క్కించుకున్నారు. ఇక ఈ టీ పొడి కావాలంటే మ‌ళ్లీ ఇంకో ఏడాది ఆగాల్సిందే.

కాగా అదే ప్రాంతంలో 100 వ‌ర‌కు ప్రైవేటు టీ ఫ్యాక్ట‌రీలు ఉన్నాయి. వాటిల్లో సుమారుగా 60వేల మంది ఉపాధి పొందుతున్నారు. వారు గ్రీన్ లీవ్స్, ఆర్థోడాక్స్ టీ, గ్రీన్ టీ వంటి పలు ప్ర‌త్యేక‌మైన టీ పొడుల‌ను త‌యారు చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news