ఎక్కువ ప్రోటీన్ వుండే ఈ కూరగాయల్ని డైట్ లో తప్పక తీసుకోండి..!

-

మనకి మంచి పోషక పదార్థాలు అందాలి. అప్పుడే మన ఆరోగ్యం బాగుంటుంది. పోషక పదార్థాలలో ప్రోటీన్ చాలా ముఖ్యమైనది. ఇది జుట్టు ఆరోగ్యం మొదలు గోళ్ల ఆరోగ్యం వరకు చాలా అవసరం. టిష్యూస్ ని రిపేర్ చేయడానికి కూడా ప్రోటీన్ అవసరం. హార్మోన్స్, ఎంజైమ్స్ వంటి వాటికి కూడా ప్రోటీన్ కావాలి. అయితే కేవలం మాంసాహారం లో మాత్రమే ఎక్కువ ప్రోటీన్ ఉంది అనుకుంటే పొరపాటు.

 

శాకాహారంలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ కూరగాయలు తీసుకుంటే ప్రోటీన్ మనకి సమృద్ధిగా అందుతుంది. అయితే మరి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాల గురించి చూద్దాం. ఈ కూరగాయల్ని కనుక మీరు రెగ్యులర్ గా తీసుకుంటే ప్రోటీన్ సమస్యలు ఉండవు. అయితే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే కూరగాయల గురించి ఎలాంటి ఆలస్యం లేకుండా చూద్దాం.

బ్రోకలీ:

బ్రోకలీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పోషక పదార్ధాలు సమృద్ధిగా ఉంటాయి. ప్రోటీన్, ఎమైనో యాసిడ్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, పొటాషియం, కాల్షియం కూడా ఉంటాయి. కనుక వీలైతే రెగ్యులర్ గా బ్రోకలీని తీసుకోండి.

కాలిఫ్లవర్:

కాలీఫ్లవర్ లో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాములు కాలీఫ్లవర్ లో 1.9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అలాగే 25 క్యాలరీలు ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కె కూడా ఎక్కువగా ఉంటుంది. కాలీఫ్లవర్ ను కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండండి. దీనిలో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

పాలకూర:

పాలకూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది 100 గ్రాముల పాలకూరలో 2.9 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి డైట్ లో ఈ కూరగాయలు, ఆకుకూరలు తీసుకుని ఆరోగ్యంగా ఉండండి అలానే సమస్య లేకుండా ఉండండి.

Read more RELATED
Recommended to you

Latest news