కోతి ఫొటో తీసి లక్షలు గెలుచుకున్నాడు

-

న్యూఢిల్లీ: అతని టాలెంట్‌కు ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. నీళ్లలో ఉన్న చెట్టు‌పైకి ఎక్కుతున్న కోతి ఫొటోను తీశాడు. ఈ ఫొటో ఇప్పుడు అందరినీ అబ్బురపరిచింది. అంతేకాదు లక్షలు వచ్చేలా చేసింది. అసలు విషయమేంటంటే… కేరళకు చెందిన థామస్ విజయన్ కెనడాలో సెటిల్ అయ్యారు. ఆయన ఓ ఫొటో గ్రాఫర్. తాజాగా విజయన్ 2021 సంవత్సరపు నేచర్ టిటిఎల్ ఫొటోగ్రాఫర్ అవార్డును గెలుచుకున్నారు. బోర్నియోలో ‘ది వరల్డ్ ఈజ్ గోయింగ్ అప్‌సైడ్ డౌన్’ అనే చిత్రాన్ని చిత్రీకరించారు. తాను నీటిలో ఉన్న ఒక చెట్టును ఎంచుకున్నాడు. ఆ తర్వాత చెట్టెక్కి గంటలకొద్దీ వెయిట్ చేశాడు. అయితే పై నుంచి తనకు నీళ్లలో ఉన్న చెట్టును అద్దంలో చూస్తున్నట్టనిపించింది. ఆ సమయంలో ఓ కోతి చెట్టు పైకెక్కింది. వెంటనే ఈ దృశ్యాన్ని క్లిక్ మనిపించారు. ఈ ఫొటోనే తనకు లక్షలు వచ్చే చేసిందని విజయన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. మొత్తం రూ.1.5 లక్షల బహుమతి తనకు దక్కిందని పేర్కొన్నారు. మొత్తం 8 వేల ఫొటోల్లో తన ఫొటోకు బహుమతి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. విజయన్ భారతసంతతి వ్యక్తి కావడంతో భారతీయుల్లో కూడా హర్షం వ్యక్తమవుతోంది. విజయన్ తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news