కాంప్లిమెంట్సే అయినా ఇబ్బంది కలుగజేసే కొన్ని మాటలు..

-

పొగడ్తలకి పడని వారు దాదాపు ఉండరనే చెప్పాలి. సరైన విధానంలో సరిగ్గా పొగడగలగడం కూడా ఒక కళ. చాలా మందికి అది తెలియదు. అందువల్ల కొన్ని సార్లు ఆ పొగడ్తలు అవతలి వారిని ఇబ్బందికి గురి చేస్తాయి. ప్రస్తుతం అలాంటి పొగడ్తల గురించి తెలుసుకుందాం.

నువ్వు సమయానికి వచ్చావు అనేది చాలా సార్లు ఉపయోగిస్తారు. కానీ దీని వెనకాల మరో అర్థం కూడా ఉంది. ఇప్పుడు సమయానికి వచ్చావని అంటే దానర్థం, ప్రతీరోజూ ఆలస్యంగా వస్తావన్నట్టుగా అనిపిస్తుంది.

ఈ రోజు మేకప్ లో చాలా తక్కువ వయసులో ఉన్నట్టు కనిపిస్తున్నావు..

ఇలా చెప్పడం అవతలి వారిని బాధిస్తుంది. అంటే మేకప్ లేకపోతే ఎక్కువ వయసులో ఉన్నట్టు కనిపిస్తానా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే వయసుకి సంబంధించిన మెచ్చుకోళ్ళు ఎవరికీ అంతగా నచ్చవు.

నీకు నువ్వు సొంతంగా పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం..

ఏదైనా పని పూర్తి చేసిన సందర్భంలో ఇలాంటి మాటలు చెబుతుంటారు. దీనివల్ల అవతలి వ్యక్తికి ఇన్నాళ్ళుగా పక్కన వారి మీద ఆధారపడ్డానా అన్న అనుమానం వస్తుంది. అదీగాక ఇన్నాళ్ళూ నా గురించి ఈ విధంగా ఆలోచించారా అనిపిస్తుంది.

ఇంత అందంగా ఉండి కూడా సింగిల్ గా ఉన్నావంటే ఆశ్చర్యం వేస్తుంది.

సింగిల్ గా జీవనం గడిపే ఎవ్వరికైనా వారి ఒంటరి బ్రతుకు గురించి పది మందిలో చెప్పుకోవాలని అనిపించదు. అది మీరు గుర్తించకుండా వారి జీవితాన్ని గురించి కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ పోతే వారికి అదోలా అనిపిస్తుంది.

ఇంతమంది పిల్లల్ని చాలా బాగా మేనేజ్ చేస్తున్నావు

ఇది వారి వారి వ్యక్తిగత జీవితాల మీద ప్రశ్న వేస్తున్నట్టుగా అనిపిస్తుంది. వారికి ఎక్కువ మంది పిల్లలున్నారని, వారి వ్యక్తిగత ఛాయిస్ ల మీద మీరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news