అమెరికాలో కరోనా వైరస్ ఏ స్థాయిలో జనాలకు చుక్కలు చూపిస్తుందో అందరికి తెలిసిందే. రోజు రోజుకి కరోనా తీవ్రత అక్కడ పెరగడం కనీసం గత నాలుగు రోజుల నుంచి దాదాపు 3 వేల మంది ప్రతీ రోజు అక్కడ చనిపోవడం అనేది జరుగుతుంది. అయినా సరే జనాల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారు రోడ్ల మీదకు వచ్చేస్తున్నారు.
అక్కడ లాక్ డౌన్ అధికారికంగా ప్రకటన చేయలేదు. దీనితో జనాలు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. ఎన్ని విధాలుగా చెప్పినా సరే అర్ధం చేసుకోవడం లేదు. అన్ని రాష్ట్రాల్లో కూడా వేల కేసులు ఉన్నాయి. రెండు మూడు రోజుల్లో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక మరణాలు కూడా 50 వేలు దాటాయి.
అయినా సరే జనాలు ఫ్లోరిడా బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వేలాది మంది వెళ్లి బీచ్ లో కరోనా హాలిడే ని ఎంజాయ్ చేయడం ఆందోళన కలిగించే అంశం. ఫ్లోరిడాలో ప్రజలు బీచ్ లకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్లోనే ఉండాలని, బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నా జనాలు మాత్రం మారడం లేదు. ఆ రాష్ట్రంలో 29,648 కరోనా కేసులు నమోదుకాగా, 987 మంది మరణించారు.