రాజస్థాన్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఆలయంలో తొక్కిసలాట వల్ల ముగ్గురు భక్తులు మృతి చెందారు. సికర్ జిల్లాలోని ఖత్ శ్యామ్‌జీ ఆలయంలో మాసోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. తెల్లవారుజామున 5 గంటలకు అర్చకులు ఆలయ తలుపులు తెరిచారు. దీంతో భక్తులు ఒక్కసారిగా ఆలయంలో పరిగెత్తుకుంటూ వచ్చారు.

ఈ క్రమంలో తొక్కిసలాట ఏర్పడింది. ఒకరినొకరు తోసుకోవడంతో పలువురు భక్తులు కిందపడ్డారు. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మహిళా భక్తులు మృతి చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు మృతదేహాలను మార్చరీకి తరలించారు. అలాగే క్షతగాత్రులను జైపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Rajasthan | Three people died, several injured at Khatu Shyamji Temple in Sikar where a stampede occurred during a monthly fair, earlier this morning. Two injured people referred to a hospital in Jaipur. Police present at the spot. Further details awaited. pic.twitter.com/bgnL9sRr1j
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) August 8, 2022