చైనాలో అద్భుతం.. ఆకాశంలో ముగ్గురు సూర్యుల దర్శనం !

-

చైనాలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. అదేంటంటే ఆకాశంలో ఒకేసారి ముగ్గురు సూర్యులు కనిపించారు . ఆ అద్భుతాన్ని ప్రజలు ఎంతో ఆసక్తిగా దానిని వీక్షించారు. ముగ్గురు సూర్యులు వీడియో.. సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్‌లో ఉంది. ఆకాశంలో ఒకేసారి ముగ్గురు సూర్యులు కనిపించడంతో ప్రజలు ఇదేమి వింత అని వింతగా తిలకించారు.

పొద్దున్న 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకూ ఈ అద్భుతం చోటుచేసుకుంది. నిజమైన సూర్యుడికి ఇరువైపులా ప్రతిబింబాల్లా కనిపించే సూర్యులను ఫాంటమ్‌ సన్స్‌ లేదా సన్‌ డాగ్స్‌ అని పిలుస్తారు. సిర్రస్‌ మేఘాల్లోని మంచు స్ఫటికాల గుండా సూర్యరశ్మి ప్రయాణించినప్పుడు. సూర్యుడికి పక్కనే మరిన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మంగోలియాలో ఆకాశంలో ఒకే సారి ఐదుగురు సూర్యులు దర్శనమిచ్చారు. 2015లో రష్యాలో ముగ్గురు సూర్యుల ఉదయం కను విందు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news